భీమిలి నియోజకవర్గం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ(సెల్ నెంబర్.9440592368)(9502817542)
SEC సభ్యులు శ్రీ పోతిన హనుమంతరావు , గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు భీమిలి నియోజకవర్గంలోని బక్కన్నపాలెం గ్రామంలో నిర్వహించిన గ్రామదేవత శ్రీశ్రీశ్రీ బబ్బేలమ్మ అమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమంలో *విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేకంగా ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు చిన్న శ్రీను గారికి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చిన్న శ్రీను గారు మాట్లాడుతూ, గ్రామదేవతల పండుగలు గ్రామాల్లో ఐక్యత, భక్తి భావం, సాంప్రదాయ సంస్కృతిని పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. శ్రీ బబ్బేలమ్మ అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.