అంగరంగ వైభవంగా విశాఖ జిల్లా మధురవాడ, లోబక్కన్నపాలెం బబ్బెల్లమ్మ పండగ.. బబ్బేలమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి బాలరాజు, కొయ్య ప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి అవంతి అల్లుడు శ్రావణ్ కుమార్, అవంతి సోదరుడు ముత్తం శెట్టి మహేష్.

*బబ్బేల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న తీసుకున్న మాజీ మంత్రి బాలరాజు,మాజీ మంత్రి అవంతి శ్రీనివాసులు అల్లుడుశ్రావణ్ కుమార్*అవంతి సోదరుడు ముత్తం శెట్టిమహేష్.
భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ)

మధురవాడ బక్కన్నపాలెంలో బుధ వారం శ్రీశ్రీశ్రీ బబ్బేలమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం అత్యంత ఆధ్యాత్మిక శోభతో వైభవంగా జరిగింది. మధురవాడ 6వ వార్డునాయకులు పోతిన హనుమంతురావు,పోతిన మూర్తి కుటుంబం,రాయిన సాయి, మాతృశ్రీ బిల్డర్స్ అదినేత పోతిన శివ ఆహ్వానం మేరకు అవంతి ఇంజినీరింగ్ కళాశాల ల మ్యానేజింగ్ డైరెక్టర్ శ్రావణ్ కుమార్,అవంతి శ్రీనివాసరావు సోదరుడు ముత్తంశెట్టి మహేష్ లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని తల్లి మెండైన ఆశీర్వాదాలు తీసుకున్నారు. బబ్బేలమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్,మహేష్ లు ఆకాంక్షించారు.అనంతరం పోతిన వారి కుటుంబ సభ్యులు తో కాసేపు సంభాషించి యోగా క్షేమాలు అడగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు,6వ నాయకులు నాయకులు పాల్గొన్నారు.