రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పాలూరు సత్యనారాయణకు , విశాఖ జిల్లా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా ఘన సన్మానం..

విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి సూచనల మేరకు 
వి సి ఐ వారి క్యాలెండర్ ఈవెంట్స్ లో భాగముగా *డాక్టర్స్ డే* సందర్భముగా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఈ దినం తేది: *01-07-2026* బుధవారం లాసన్స్ బే కాలనీ లో నివాసము ఉంటున్న డాక్టర్ పాలూరి సత్యనారాయణ , రిటైర్డ్ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ నకు వారి గృహ మందు శాలువా తో సత్కరించి పండ్లు స్వీట్స్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు పదవీ విరమణ చేసినను ప్రస్తుతం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు నందు తన యొక్క సేవలునిరంతరం కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన సేవలు అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా కోశాధికారి నర్సింగరావు, జోన్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు , ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివరామకృష్ణ,పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా క్లబ్ సభ్యులు రమేష్ బాబు, సన్యాసిరాజు పాల్గొన్నారు.