(విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
*క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని... మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన చిన్న శ్రీను గారు*
*విజయనగరం, జూలై 28:*
విజయనగరం మండలం చెల్లూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం అత్యంత బాధాకరమని *విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)గారు* తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సోమవారం రాత్రి రాయగడకు వెళ్తున్న బొలెరో ట్రక్కును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మజ్జిపేటకు చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో పది మంది తీవ్ర గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే చిన్న శ్రీను గారు విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికవర్ హాస్పిటల్, శ్రీనిధి హాస్పిటల్‌లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు.
అనంతరం బాధితుల కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చిన చిన్న శ్రీను గారు, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పద్మనాభం మండల పార్టీ అధ్యక్షులు కోరాడ లక్ష్మణ్ గారు, బి.ఆర్. తాళవలస ఎంపీటీసీ చందక పైడినాయుడు గారు, మాజీ సర్పంచ్ శ్రీను గారు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.