ఒక్కరోజులో 1.38 లక్షల మంది భక్తుల దర్శనం
ఆంధ్ర ప్రదేశ్.
రాజమండ్రి-- వాడపల్లి- జూలై 25:
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి శనివారం రికార్డు స్థాయిలో రూ.1,09,93,823 ఆదాయం వచ్చింది. ఆలయాన్ని సుమారు 1,38,415 మంది భక్తులు దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం అందుకున్నాను..ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, ప్రసాదాల విక్రయం, ఆన్‌లైన్ సేవలు, విరాళాలు తదితర మార్గాల ద్వారా మొత్తం ఆదాయం లభించిందన్నారు.
ప్రధాన ఆదాయ వివరాలు:
ప్రత్యేక దర్శనం ద్వారా – రూ.12,02,100
విశిష్ట దర్శనం ద్వారా – రూ.18,89,800
వేద ఆశీర్వచనం ద్వారా – రూ.23,94,936
ఆన్‌లైన్ సేవల ద్వారా – రూ.31,66,152
లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా – రూ.11,26,110
పులిహోర ప్రసాదం విక్రయం ద్వారా – రూ.2,23,410
నిత్య అన్నదానానికి విరాళాలు – రూ.2,66,666
శాశ్వత అన్నదానానికి విరాళాలు – రూ.4,33,044
షాపుల ద్వారా ఆదాయం – రూ.2,00,311
టికెట్ల విక్రయంలో ప్రత్యేక దర్శనం 24,042, విశిష్ట దర్శనం 9,449, వేద ఆశీర్వచనం 2,146, కళ్యాణకట్ట 669, సుప్రభాతం 125, తులాభారం 11 టికెట్లు విక్రయమయ్యాయి. అలాగే లడ్డూ ప్రసాదాలు 75,074, పులిహోర ప్రసాదాలు 22,341, లడ్డూ మహాప్రసాదాలు 19 విక్రయించినట్లు అధికారులు తెలిపారు.భక్తుల రద్దీ దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ 104, 108 సేవలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మొత్తం 981 మంది భక్తులకు వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు.ఆలయానికి ఒక్కరోజులో రూ.1.09 కోట్లకు పైగా ఆదాయం రావడం, లక్షా 38 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోవడం విశేషమని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, ప్రసాదాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు.