విశాఖ జిల్లా ఎండాడ స్కై పార్క్ నూతన లైన్స్ క్లబ్ సేవ అత్యంత అద్భుతం. 2025- 26. క్లబ్ ఏర్పాటు చేసిన ఐదు నెలల కాలంలో విస్తృతమైన సేవలు.. స్కై పార్క్ లైన్స్ క్లబ్ సేవకులకు గవర్నర్ లైన్ సూర్య ప్రకాష్, క్లబ్ అధ్యక్షులు లైన్ వెంకట శివప్రసాద్ ఇద్దరిచేతుల మీదగా పలువురు క్లబ్ సేవకులకు అవార్డులు.. అవార్డులు మరింత బాధ్యతను పెంచాయి.. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తాం స్కై పార్క్ క్లబ్ నిర్వాహకులు.విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )వైశాఖి స్కై పార్క్ లయన్స్ క్లబ్ నెలవారీ సమావేశం ఆదివారం కమ్యూనిటీ నందు గల నార్త్ క్లబ్ హౌస్ లో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కమ్యూనిటీ నందు లైన్స్ క్లబ్ ప్రారంభించిన 5 నెలల వ్యవధిలో క్లబ్ నిర్వహించిన కార్యక్రమాలను కొనియాడుతూ జిల్లా 316 ఏ 2025-2026 గవర్నర్ లైన్స్ క్లబ్ రామ్ నగర్ లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ న్యూ క్లబ్ అవార్డు లైన్స్ క్లబ్అధ్యక్షులు లయన్ వెంకట శివ హరిప్రసాద్ గారు గవర్నర్ లయన్ సూర్య ప్రకాష్ గారి చేతుల మీదుగా అందుకున్నారు.అదేవిధంగా బెస్ట్ యాక్టివ్ న్యూ లయన్ మెంబర్ అవార్డ్ కోశాధికారి లయన్ విశ్వనాథ శాస్త్రి గారు చేజిక్కించుకున్నారు . అంతర్జాతీయ అధ్యక్షులు యొక్క సర్టిఫికెట్ ఆఫ్ ఏప్రిసియేషన్ అవార్డ్ కూడా అధ్యక్షులు హరిప్రసాద్ అందుకున్నారు.క్లబ్ స్థాపించిన అనతి కాలంలోనే అవార్డులు సొంతం చేసుకోవడం చాలా ఆనందదాయకమని, సభ్యులు సహాయ సహకారముల వలన జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సూచనలు సలహాలు మేరకు అవార్డులు సొంతం చేసుకోగలిగామని అధ్యక్షులు , కోశాధికారిలు తెలిపినారు. ఈ ఉత్తేజముతో రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి స్కై పార్క్ లైన్స్ క్లబ్ ను మరింత ఉన్నత స్థాయిలో ఉండేవిధంగా సభ్యులందరి సహకారంతో మా వంతుగా కృషి చేస్తామని తెలియజేసినారు..ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యకులు లయన్ రమేష్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.