విశాఖ సిటీ అల్లిపురం భీమ్ నగర్ లో ఏ యు టి డి షెల్టర్ లో నిరాశ్రయులైన వయోవృద్ధులకు 72 మందికి వాసవి క్లబ్ జోన్ 2ఎంవిపి కపుల్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు చెరకు ధర్మరాజు జ్ఞాపకార్థం భార్య సునీత, కొడుకు కోడలు.మధ్యాహ్నం అన్నదానం..

జై వాసవి. జై జై వాసవి...
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ (: సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ) 

వాసవి క్లబ్ ఎం వీ పీ కపుల్స్ ఆధ్వర్యంలో 02.07.2026 గురువారం మధ్యాహ్నం అల్లిపురం , భీంనగర్ లో గల ఏ.యూ.టి.డి. షెల్టర్ లో గల నిరాశ్రయులైన 72 మంది వయో వృద్ధులకు కీర్తిశేషులు చెరుకు ధర్మరాజు జ్ఞాపకార్థం వారి సతీమణి చెరుకు సునీత, కుమారుడు కృష్ణమూర్తి, కోడలు అపర్ణ గారి సహాయం తో భోజనం సదుపాయం ఏర్పాటు చెయ్యడం జరిగినది.. ఈ కార్యక్రమంలో క్లబ్బు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్త, జోన్2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణా రావు, పూర్వపు అధ్యక్షులు గ్రంధి కృష్ణా రావు , క్లబ్ సభ్యులు రమేష్ బాబు,ఈశ్వర హేమంత్ కుమార్ పాల్గొన్నారు. ఎ యు టి డి సిబ్బంది దాతలకు మరియు క్లబ్ సబ్యులు కు ధన్యవాదాలు తెలిపారు.