ఐక్యమత్యంతో దేనినైనా సాధించవచ్చు.. విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు. ఎండాడ లో భగవాన్ శ్రీ సత్య సాయి పల్లకి ఊరేగింపు మహోత్సవం ప్రారంభం.

ఐక్యమత్యంతో దేనినైనా సాధించవచ్చు విశాఖ జిల్లా సత్య సాయి సేవా సంస్థల అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు.
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
ఓం శ్రీ సాయిరాం ....
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో *శ్రీ సత్యసాయి భజన మండలి* *ఎండాడ*
*సిటీ సమితి* *విశాఖపట్నం జిల్లా* వారి ఆధ్వర్యంలో తేదీ 11/07/2026 శనివారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలు కు వేద పారాయణతో ప్రారంభమై అష్టోత్తర శత నామార్చన అనంతరం , సేవా కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు , ప్రత్యేక అతిధులు రాష్ట్ర జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ రాఘవరావు ,రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఇన్చార్జి అమ్మాజీ గారు ,సిటీ సమితి కన్వీనర్ శ్రీ సాయికుమార్,బాలవికాస్ ఇంచార్జ్ మాధవి గారు, ఆధ్యాత్మిక ఇన్చార్జి హరణి గారు ,ఎండాడ భజన మండలి బాలవికాస్ ఇంచార్జ్ రఘునందన రాజు, వారి బాలవికాస్ చిన్నారులచే మందిరం ఆవరణలో ఆరు మొక్కలు నాటిన పిదప జిల్లా అధ్యక్షులు వారు మరియు సిటీ సమితి కన్వీనర్, భజన మండలి కన్వీనర్ వెంకట రామకృష్ణారావు మందిరంలో ఉన్న శ్రీ సత్య సాయి పల్లకిని
బయటకు తీసుకుని వచ్చి అన్ని భజన మండలిలు కన్వీనర్లు చే కొబ్బరికాయలు కొట్టించి హారతులు ఇచ్చి *శ్రీ సత్యసాయి పల్లకి మహోత్సవాన్ని* ప్రారంభించినారు. ఈ పల్లకి మహోత్సవం ఎండాడ పురవీధులలో రాజీవ్ నగర్ కాలనీ అప్, తెలగ ఎండాడ వీధి, ముబారక్ కాలనీ లలో తీసుకుని వెళ్లి అనేకమంది గృహస్తులు సుమారు వందమందికి పైగా స్వామి వారి పల్లకి దగ్గరికి వచ్చి హారతులు ఇచ్చి ప్రసాదములు అందుకున్నారు. ఈ పల్లకి మహోత్సవం తిరిగి రాజీవ్ నగర్ మరియు శాంతినగర్ మీదుగా మందిరమునకు చేరినది. తర్వాత మందిరం మహిళ సేవాదళ్ సభ్యుల ప్రత్యేక దీపములతో కూడిన హారతులు చూపించి చివరగా కన్వీనర్ కొబ్బరి కాయ హారతి ఇచ్చి పల్లకిని మందిరంలో కి తీసుకుని వెళ్ళినారు. జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రేమ తత్వంతో ఉండి, అందరు ఐక్యమత్యంతో సేవ చేస్తే స్వామి మనకు దగ్గరవుతారని పేర్కొన్నారు. నామ సంకీర్తనలు, గృహ నామ సంకీర్తనలు, నగర సంకీర్తన, నారాయణ సేవ, తదితర కార్యక్రమాలు చేసుకొని మందిరంను అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లి స్వామివారి ఆశీస్సులు పొందవలసిన గా కోరినారు. శ్రీ రాఘవరావు గారు స్వామికి ప్రత్యేకమైన పద్యము గానం చేసి జిల్లా అధ్యక్షులు వారు చెప్పిన రీతిలో సభ్యులందరూ మెలగాలని కోరినారు. ఆఖరిగా కన్వీనర్ రామకృష్ణారావు మాట్లాడుతూ సిటీ సమితి ఆధ్వర్యంలో ఉన్న అన్ని భజన మండలి కన్వీనర్లు , సభ్యులు, జిల్లా పదాధికారులు, గాజువాక యూత్ సభ్యులు , ప్రత్యేకించి ఎండాడ మందిరం సేవాదళ్ సభ్యులు మహిళలు మరియు పురుషులు సహకరించటం వలన ఈ పల్లకి మహోత్సవం అద్భుతంగా జరిగింది అని చెప్పినారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన అందరు కన్వీనర్లకు మరియు హాజరైన పెద్దలందరికీ మెమెంటోళ్లు ఇచ్చి స్వామివారి ఆశీస్సులు ఇచ్చినారు. తదనంతరం స్వామివారికి మంగళ హారతినిచ్చి ప్రసాద వితరణతో కార్యక్రమాన్ని ముగించినారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా పదాదికారులు , సిటీ సమితి పరిధిలో ఉన్న అన్ని భజన మండలి కన్వీనర్లు, ఎండాడ భజన మండలి ఇంచార్జ్ కృష్ణారావు, ఆధ్యాత్మిక ఇంచార్జ్ రామచంద్రరావు, గ్రూప్ లీడర్ అప్పలనాయుడు మాస్టర్, గోపి, మహిళా ఇన్చార్జిలు పద్మజ, శ్యామల, నాగవేణి, లక్ష్మి మరియు సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు