విశాఖపట్నం జిల్లా మధురవాడ మూడు గుళ్ళు (కొమ్మాది) జంక్షన్ లో కొలువై ఉన్న (త్రిశక్తి దేవాలయం)లో శ్రీ బంగారమ్మ, శ్రీఎర్నమ్మ, శ్రీ దండుమారమ్మ ఆలయంలో ఈరోజు ఆషాడ మాసం మొదట ఆదివారం సందర్భంగా శ్రీ ఎర్నమ్మ తల్లికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం ఆలయ అర్చకులు నిష్టల రాంబాబు శర్మ తదితరులు నిర్వహించారు అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పుష్పార్చన, కుంకుమార్చన పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులు తెచ్చిన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి కర్పూర నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించడం జరిగింది, అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు వితరణ చేసారు,
ఈ సందర్బంగా ఆలయ అర్చకులు నిఫ్ఠల రాంబాబు మాట్లాడుతూ సంతానాన్ని ప్రసాదించే తల్లి ఎర్నమ్మ తల్లి అని, సంతానం కలుగజేయుటకు, సంతానమునకు దీర్ఘ ఆయువు చేకూరుటకు ఈ ఆషాడ మాసం నాలుగు ఆదివారాలు ఎర్నమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఆరాధనలు జరిపించడం జరుగుతుందని తెలిపారు.