భగవంతునిపై అచంచలమైన భక్తి విశ్వాసం ఉంటే సాయి భక్తులు ఏ కార్యం తలపెట్టిన అది కార్యరూపం దాల్చుతుంది... సత్యసాయి సేవా సంస్థల శ్రీకాకుళం జిల్లా విద్యా జ్యోతి ఇంచార్జ్ ఎం.జనార్ధన్. ఎండాడ సత్యసాయి మందిరంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ఎం జనార్ధన్.

భగవంతునిపై ఆచంచ లమైనభక్తి , విశ్వాసం ఉంటే సాయి భక్తులు ఏ కార్యం తలపెట్టిన అది విజయవంతం అవుతుంది.--- సత్యసాయి సేవా సంస్థల శ్రీకాకుళం జిల్లా విద్యా జ్యోతి ఇన్చార్జ్ ఎం జనార్ధన్.

విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్; (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 16 .7. 2026 గురువారం శ్రీ సత్యసాయి భజన మండలి,ఎండాడ లోసాయంత్రం నామ సంకీర్తన అనంతరం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రీకాకుళం జిల్లా విద్యా జ్యోతి ఇంచార్జి శ్రీ ఎం.జనార్ధన్ విచ్చేసి తన ఆధ్యాత్మిక ప్రసంగాన్ని భక్తులను ఆకట్టుకునే విధంగా కొన సాగించినారు. భగవంతుడి పై అచంచల భక్తి,విశ్వాసం కలిగి ఉండి మానవుడు తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని . శ్రీ సత్యసాయి బాబా వారు నామ సంకీర్తన కు ప్రాధాన్యత ఇచ్చేవారని, విద్యార్థులతో చాలా ప్రేమతో ఉండేవారని వారితో చమత్కారం తో మాట్లాడతారని తెలియచేశారు.సత్య సాయి సంస్థలు అభివృద్ధి పథంలోకి వెళ్లేందుకు స్వామి వారు సూచించిన క్రమశిక్షణ లు పాటించాలని మరొక సారి గుర్తు చేశారు.తన ప్రసంగం అనంతరం భజన మండలి కన్వీనర్ వెంకట రామకృష్ణారావు, మందిరం ఇన్చార్జ్ కృష్ణారావు, సభ్యులు ప్రకాశరావు, గోపి సాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటం, విభూది, ఫ్రూట్స్ బహుకరించినారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ఇంచార్జి రామచంద్రరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.