మధురవాడలో ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశంపై విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మిథిలాపురి ఉడా కాలనీ లో ( కమ్యూనిటీ హాల్, గ్రంథాలయం, పాత పోలీస్ స్టేషన్,, పాత సచివాలయం (హనుమాన్ టెంపుల్ నిలిచింది) ఈ స్థలానికి చాలా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లతో కొన్ని సంవత్సరాలు సమాజానికి ఉపయోగపడింది) స్థలాన్ని పరిశీలించి అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ, "ఈ ప్రాంతంలో ఒకప్పుడు ప్రజల అవసరాల కోసం పోలీస్ స్టేషన్, ప్రభుత్వ గ్రంథాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉండేవి. ప్రస్తుతం ఆ భవనాలను కూల్చివేసి, ఈ విలువైన ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి" అని పేర్కొన్నారు.
"ప్రజల కోసం కేటాయించిన ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే, వాటిని ప్రైవేటు ప్రయోజనాల కోసం వినియోగించే పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రజల ఆస్తులపై ఎవరు కన్నేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు" అని స్పష్టం చేశారు.
అలాగే "ఈ భూముల కేటాయింపులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలి. ప్రజలకు చెందిన ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో !పారదర్శకంగా వ్యవహరించాలి" అని డిమాండ్ చేశారు.
"ప్రజల ఆస్తులను కాపాడేందుకు అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్నైనా బలంగా వ్యతిరేకిస్తాం. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తాం" అని చిన్న శ్రీను పేర్కొన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో YCP* *స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్* *మెంబెర్*
*పోతిన హనుమంతరావు* ,6వ వార్డు అధ్యక్షులు పోతిన ప్రసాద్ ,7వ వార్డు అధ్యక్షులు పోతిన శీను , 8వ వార్డు పోలి రెడ్డి , పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిల్ల సూరిబాబు, పిల్లా సుజాత, ముదిండి రాజేశ్వరి, ఎంవి రమణమూర్తి, త్రిమూర్తి రాజు, మగ్గూరి వెంకట్రావు, మీసాల సత్యం (పాత మధురవాడ మెట్ట) తదితరులు పాల్గొన్నారు.