విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వి 201 ఏ, రీజియన్ 2, జోన్ 2 లోగల వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో
తేదీ 15.08.2026 , శనివారం నాడు 80 వ స్వాతంత్ర దినోత్సవము ను పురస్కరించుకొని సెక్టార్ 9 , ఫిషర్ మెన్ కాలనీ యందు క్లబ్బు పూర్వపు అధ్యక్షులు గోగుల నర్సింగ్ రావు గారి గృహ ప్రాంగణంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన వి 201 ఏ , వాసవి క్లబ్బులు, విశాఖపట్నం జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప స్టార్ కేసీజిఎఫ్ శ్రేయోభిలాషి వంకాయల సాయి నిర్మల , రామ్ గోపాల్ గార్లు జాతీయ జెండా వందన సమర్పణ గావించి, జాతీయ గీతం సామూహికంగా ఆలాపన చేసినారు. తదుపరి పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు, బుక్స్ ,పెన్సిల్స్ గవర్నర్ గారి స్వహస్తాలతో పంచినారు. గవర్నర్ గారు మాట్లాడుతూ క్లబ్బు సభ్యులు ప్రతి క్యాలండర్ యాక్టివిటీస్ చేస్తూ మిగతా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని అభినందించారు. వచ్చే సెప్టెంబర్ నెలలో వాసవి వీక్ సందర్భంగా అన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అంతర్జాతీయ అధ్యక్షులు గుడ్విల్ విజిట్ సందర్భంగా వీ సీ ఐ ద్వారా పంపబడిన బ్యాడ్జి క్లబ్ అధ్యక్షులు వాసవియన్ కే వెంకటరమణ మూర్తి గారికి అందజేసినారు. తర్వాత ప్రోగ్రాం చైర్ పర్సన్ వాసవియన్ శివరామకృష్ణ గారి వందన సమర్పణ తో కార్యక్రమం ముగింపు జరిగింది.ఈ కార్యక్రమంలో జోన్ 2 ఛైర్పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు,క్లబ్ కోశాధికారి చెరుకూరి నర్సింగరావు, పూర్వపాధ్యక్షులు గ్రంధి కృష్ణారావు, కంచర్ల వెంకట సతీష్ , క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.