విజయనగరం జిల్లా ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను. తెలగా పాలెం జామి మండలం )
బ్లడ్ స్టోరేజ్ సెంటర్‌తో ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలు.
చీపురుపల్లి నియోజకవర్గం,
చీపురుపల్లి హెడ్ క్వార్టర్,
తేది. 14.08.2026.
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు తో కలిసి చీపురుపల్లి మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వైద్య సేవల కేంద్రాల పరిసరాలను పచ్చదనంతో నింపాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చీపురల్లి మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ స్టోరేజ్ సెంటర్‌ను చీపురల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు తో కలిసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది.
అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే రక్త నిల్వలు అందుబాటులో ఉండటం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ప్రాణాలను కాపాడటంలో ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని,
ఈ సందర్భంగా కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి “ప్రజల ఆరోగ్యం – పర్యావరణ పరిరక్షణ” రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే సంకల్పంతో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం ఆనందాయకమని,