విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
కీ.శే.మాజీ సర్పంచ్ పోతిన వెంకట రమణ కుమారుడైన పోతిన మూర్తి బాబు jiస్వగృహంలో ఆయన ద్వితీయ కుమారుడు లావణ్యాష్ ప్రథమ జన్మదిన వేడుకలు ఆదివారం అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి), ఆయన కుమార్తె, 6వ వార్డు మాజీ కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వేడుకలకు విచ్చేసిన ముత్తంశెట్టి కుటుంబ సభ్యులకు పోతిన సోదరులు ఘనంగా, సాదర స్వాగతం పలికారు. అనంతరం మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రియాంకలు చిన్నారి లావణ్యాష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా పోతిన కుటుంబ సభ్యులతో, స్థానిక నాయకులతో అవంతి శ్రీనివాసరావు కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, చేకూరి రజిని, మాజీ వైసీపీ అధ్యక్షుడు ఆరవ వార్డు బొట్ట అప్పలరాజు, పిల్లా వెంకట రమణ వైయస్సార్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.