ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాలి.. నల్లధనాన్ని బయటకు తీసి మోడీ ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు పంచాలి... విశాఖపట్నంలో విరాజిల్లుతున్న కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శన టికెట్ల నకిలీలపై సమగ్ర విచారణ చేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి,, జీవీఎంసీ ఎన్నికలు తక్షణమే జరపాలి. --- సిపిఐ డిమాండ్... సిపిఐ సీనియర్ నేత లు జే వి ఎస్ ఎన్... మరుపల్లి పైడ్రాజు.విశాఖపట్నం ఆగస్టు 26 విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ : మానం శ్రీను మధురవాడ ) ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర సరుకులు ధరలు.... నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాలి డిమాండ్.- సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె వి సత్యనారాయణమూర్తి.బుధవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం అల్లిపురం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈసమావేశంలో సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 5 నెలలు క్రిందట 1370 రూపాయలు ఉన్న 26 కేజిల బియ్యం ధర ఈరోజు 1770 రూపాయలు అంటే 400 రూపాయలు పెరిగిందని వీటితో పాటు పంచదార, అపరాలు, పప్పులు, నూనెలు ధరలు విపరీతంగా పెరిగాయని ధరలు పెరుగుదల వలన పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 12 సంవత్సరాల క్రితం నేను అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తానని, సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగం నిర్ములిస్తామని, విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి పేదలకు పంచుతానని హామీలు ఇచ్చిన నరేంద్ర మోదీ ఆహామీలు అన్ని గాలికి వదిలేసారని తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.తక్షణమే జీవీఎంసీ ఎన్నికలు జరిపించాలి !----------------భీమిలీ, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాలలోని పంచాయితీలు, బోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని విశాఖ జీవీఎంసీ కలుపుతామని గందరగోలం సృష్టించకుండా తక్షణమే జీవీఎంసీకి ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేసారు.కనకమహాలక్ష్మి ఆలయ నకిలీ టికెట్స్ పై విచారణ చెయ్యాలి !విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో 200 రూపాయలు నకిలీ టికెట్స్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్సించాలని కూడా సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. కె సత్యాంజనేయ అధ్యక్షతన జరిగినఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్, సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు ఎం పైడిరాజు, ఎండి బేగం, కె వనజాక్షి, ఎం మన్మధరావు, ఆర్ శ్రీనివాసరావు, ఎన్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.