విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలిలో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మధురవాడ్ని మాదాపూర్ లా తయారు చేస్తా, గచ్చిబౌలిలా తయారు చేస్తా ఆయన తొలిసారి పలికిన పలుకు అదే బాటలో నడుస్తున్నాయి.. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసే శంకుస్థాపనలన్నీ నేడు తుది మెరుగులు దిద్దుకున్నాయి. ఆనాడు మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ పూర్తి అవుతున్నాయి.
మంగళవారం
కొమ్మాది, సాయిరాం కాలనీ కళ్యాణ మండపాలను అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అసంపూర్ణంగా ఉన్న ఈ మండపాలకు తన చొరవతో రూ.1.66 కోట్లు నిధులు మంజూరు చేయించగా, అన్ని హంగులతో నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఫాల్ సీలింగ్, నీటి వసతి వంటి చిన్నపాటి పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వి. అయ్యప్ప నాయుడు, ఈఈ వెంకట వాసు, నాగోతి సత్యనారాయణ, మొల్లి లక్ష్మణరావు, గరే గుర్నాథ్, లొడగల జానకిరామ్, గడ్డి శ్రీను, కానూరు అచ్యుతరావు, బోయి శ్రీను, నాగోతి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
సాయిరాం కాలనీలో ఇంటింటి ప్రచారం.
అనంతరం జీవీఎంసీ 5వ వార్డు సాయిరాం కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించామని వివరించారు. మహిళల కోసం స్త్రీ శక్తి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు.
బంగారమ్మ తల్లి ఉత్సవాల్లో...
చంద్రంపాలెంలోని బంగారమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నసమారాధనను ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పిల్లా వెంకట్రావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.