వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, విశాఖ జిల్లా వి 2o1 ఏ రీజియన్ టు ద్వితీయ సమావేశం. సంపత్ రెసిడెన్సి రాయల్ లేవట్లో వాసవి ఎన్ టూ స్టార్ కే సి జి ఎఫ్ తమ్మన మానస సమర్థ నాయకత్వంలో సమావేశం.

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, విశాఖ జిల్లా వి 2o1 ఏ రీజియన్ టు ద్వితీయ సమావేశం.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్(: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి... జై జై వాసవి...🙏
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్,
విశాఖపట్నం జిల్లా వి 201ఏ – రీజియన్ 2... ద్వితీయ సమావేశం తేదీ 10.08.2026 సోమవారం సాయంత్రం 5 గంటలకు
 వాసవియన్ 2స్టార్ కె సి జి ఎఫ్ శ్రేయోభిలాషి తమ్మన మానస గారి సమర్థ నాయకత్వంలో విజయవంతంగా సంపత్ రెసిడెన్సి, రాయల్ లేఅవుట్ నందు నిర్వహించబడింది. సమావేశం సమయానికి ప్రారంభమై, రీజియన్ 2 లోని అన్ని క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొనడంతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వాసవియన్ గోల్డ్ స్టార్ కె సి జి ఎఫ్ కె విశ్వనాథ గుప్తా గారు అంతర్జాతీయ ఉపాధ్యక్షులు (మల్టిపుల్), ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రీజియన్ 2 చైర్ పర్సన్ మానస తన రీజియన్ లో గల క్లబ్బుల యొక్క నివేదికలు ముఖ్య అతిధికి సమర్పించగా, వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్,వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్, వాసవి క్లబ్ శ్రీ మేఘాద్రి గడ్డ డైమండ్స్, వాసవి క్లబ్ కంచరపాలెం, వాసవి క్లబ్ వైజాగ్ క్లబ్బుల యొక్క అధ్యక్షులు వారి యొక్క క్లబ్బుల నిర్వహించిన కార్యకలాపాలను, అభివృద్ధి నివేదికలను ముఖ్య అతిథి ముందు తెలియజేసినారు.
సమావేశమునకు విచ్చేసిన ముఖ్యఅతిథి వాసవియన్ గోల్డెన్ స్టార్ శ్రేయోభిలాషి కె.వి గుప్తా గారు మాట్లాడుతూ రీజియన్ 2 గల క్లబ్బులు చేసిన కార్యక్రమాల పై అభినందనలు తెలియజేస్తూ, వి సి ఐ వారు సూచించిన పథకముల గురించి కూడా తెలియజేసినారు. క్లబ్బులు మరింత ప్రగతి పథంలో నడాలి అంటే సేవా కార్యక్రమాలు ఉదృతం చేయాలని సూచనలు సలహాలు ఇచ్చినారు. తదనంతరం ముఖ్యఅతిథికి మానస మరియు వివిధ క్లబ్బుల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు సాలువతో సత్కరించి, బహుమతిని అందచేసినారు. ఈ సమావేశంలో రీజియన్-2లోని జోన్ 1 చైర్ పర్సన్ సత్య వాణి, జోన్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు , రీజియన్ కార్యదర్శి కమల్ కుమార్ ,వివిధ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులుపాల్గొన్నారు.