విశాఖ సిటీ, కొమ్మాది జంక్షన్ త్రిశక్తి ఆలయంలో ఆషాడ మాస ప్రత్యేక పూజలు... భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు.... ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు. (ప్రజా బలం న్యూస్ ఆన్లైన్, ): (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )

ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా త్రిశక్తి దేవాలయంలో శ్రీ ఎర్నమ్మ తల్లి అమ్మవారికి వైభవంగా ప్రత్యేక అభిషేకాలు – శాకాంబరీ అలంకరణ, ఆషాఢం సారె సమర్పణ

విశాఖపట్నం, మధురవాడ:

విశాఖపట్నం జిల్లా మధురవాడ మూడు గుళ్లు జంక్షన్‌లోని త్రిశక్తి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ బంగారమ్మ తల్లి, శ్రీ ఎర్నమ్మ తల్లి, శ్రీ దండుమారమ్మ తల్లి అమ్మవార్లకు ఆషాఢ మాసం నాలుగో (ఆఖరి) ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ ఎర్నమ్మ తల్లి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో కూడిన పంచామృతాభిషేకంతో పాటు సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు సమర్పించిన వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అత్యంత సుందరంగా అలంకరించి, ప్రత్యేక అర్చనలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా స్వయంకృషి నగర్ వాసులు అమ్మవారి సదరం పట్టు నుంచి పసుపు, కుంకుమ కలిపిన పవిత్ర జలంతో నింపిన ముర్రాటం బిందెలను తీసుకుని, ప్రతి ఇంటి నుంచి తీసుకువచ్చిన ఆషాఢం సారెను భాజా భజంత్రీల నడుమ ఘన ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ వేడుక భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

శాకాంబరీ అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిష్ఠల రాంబాబు శర్మ వేదోక్తంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, ఉపాధ్యక్షులు పిళ్లా పాపారావు, సెక్రెటరీ మొల్లి లక్ష్మణరావు, కోశాధికారి వాండ్రాసి అప్పలరాజు, జాయింట్ సెక్రటరీ కుడితి రామారావు, కమిటీ సభ్యులు పిళ్లా అప్పన్న, యం. గణపతిరావు, పిళ్లా సూరిబాబు, ఇమంది వెంకటరమణ, నమ్మి అప్పలస్వామి, ఇమంది బాబురావు, దాట్ల గోపిరాజు, మళ్ల అప్పారావు, స్థానిక ప్రముఖులు, మహిళా భక్తులు, యువకులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.