.వాసవి సావన్ అంగడి. కి విశేష స్పందన. మాజీ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి ఎన్ ఏ.వి.ఎస్. ఎన్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో వాసవి ఎన్ విద్యా సంకల్ప గ్రంధి రాజేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం..

విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి. ముఖ్యంగా మధ్య తరగతి ఆర్య వైశ్య మహిళా వ్యాపారులందరినకి ఒక వేదిక ను ఏర్పాటు చేసి,వారు నిర్వహిస్తున్న వివిధ వ్యాపారాలను తెలియచేయుటకు ఈ "*వాసవి సావన్ అంగడి" * అనే కార్యక్రమాన్ని అంతర్జాతీయ వాసవి క్లబ్స్ జిల్లా వి201ఏ వారు 01.08.2026 న ఉదయం 8.00 గంటలనుండి సాయంత్రం 8.00 గంటలవరకు లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ లో ఎగ్జిబిషన్ తరహాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి మాజీ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ ఏ.వి. ఎస్. ఎన్.గుప్తా గారు. ప్రముఖ వ్యాపార వేత్త వాసవియన్ విద్యాసంకల్పా మరియు శ్రేయోభిలాషి గ్రంధి రాజేష్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఎక్స్పో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అడ్మినిస్ట్రేషన్ ఉపాధ్యక్షుడు వాసవియన్ కంకటాల ప్రభాకర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆర్యవైశ్య మహిళల వ్యాపారాలకు వారి వ్యాపారాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని అని చెబుతూ జిల్లా గవర్నర్ వాసవియన్ సాయినిర్మల గారిని మరియు వారికి సహకరిస్తున్న కార్య వర్గాన్ని కొనియాడారు. .అంతర్జాతీయ జాయింట్ సెక్రటరీ వాసవియన్ మోహన్ లక్ష్మీ ( కీర్తన) , పలువురు ఐ.ఈ.సి.ఆఫీసర్స్ మరియు జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు.జిల్లా గవర్నర్ వాసవియన్ సాయి నిర్మల వంకాయల మాట్లాడుతూ అంతర్జాతీయ అధ్యక్షులైన Vasavian సిద్ధా వేంకట సూర్య ప్రకాశ రావు గారి ఆశీస్సులతో మరియు ప్రోత్సాహంతో ఈ exhibition ని ప్రారంభించడం జరిగిందని ఇందులో వివిధ రకములైన మహిళా వ్యాపారులకు 30 stalls ను వారి వ్యాపారాభివృద్ధికై అతి తక్కువ అద్దెతో ఇవ్వటం జరిగిందని దీనికి ఎంతో సహకరించిన వాసవియన్స్ గరుడా రమణీ, majety విశ్వ కల్యాణ్(పండు) , డాక్టర్ రజనీ, సురేంద్రబాబు, b.v.padmavathi, చెరుకు కృష్ణ మరియు పరోక్షం గా పాల్గొని ఎంతో సహాయ సహకారముల ను అందచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. డాక్టర్ రజనీ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఎక్స్పో లో సుమారు 20లక్షలకు పైగా వ్యాపారం జరిందని ,దీనిలో పాల్గొన్న మహిళా వ్యాపారులకు కొనుగోలు చేసిన కస్టమర్లకు ధన్యవాదములు తెలిపిరి.