అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లో గల సత్యసాయి మందిరంలో గిరిజన కుటుంబాలకు విశాఖ జిల్లా ఎండాడ సత్యసాయి మందిరం కన్వీనర్ ఏవి రామకృష్ణారావు ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో సుమారు 50 గిరిజన కుటుంబాలకు అమృత కలశాలు, మహిళలకు చీరలు పంపిణీ.

విశాఖ సిటీ సమితి, ఎండాడ సత్య సాయి మందిరం.. పాడేరు గిరిజన కుటుంబాలకు అమృత కలశాలు మహిళలకు చీరలు వివిధ రకాల నిత్యావసర సరుకులు పంపిణీ.
.
. అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు:: ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :(సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను.)


ఓం శ్రీ సాయిరాం ...
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 
తేదీ 09.08.2026 ఆదివారం నాడు శ్రీ సత్య సాయి భజన మండలి, ఎండాడ, విశాఖపట్నం జిల్లా ...ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గల శ్రీ సత్య సాయి గిరిజన సేవా కేంద్రం నందు 50 గిరిజన కుటుంబాలకు, ఒకొక్క కుటుంబానికి ఒక నెల రోజులకు సరిపడా బియ్యము, మరియు 21 రకముల పప్పు దినుసులు (అమృత కలశం)(కందిపప్పు, మినప్పప్పు, శెనగపప్పు, పెసరపప్పు,నూనె, పంచదార, గోధుమపిండి, గోధుమ నూక,ఎర్ర మిరపకాయలు, బటానీలు, చింతపండు, ఆవాలు, జీలకర్ర, చిల్లి పౌడర్ ,పసుపు, లక్స్ సబ్బు, రిన్ సబ్బు, షాంపూ ప్యాకెట్లు, టూత్ పేస్టు, కొబ్బరినూనె ,సాల్టు), మరియు ఒక చీర, ఒక స్టీల్ బేసిన్ ,ఒక సిల్వర్ గిన్నె ఒక కిట్టుగా తయారుచేసి వాటితో స్వామివారి ఫోటో ల్యామినేషన్ మరియు విభూది ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. ముందుగా బస్సులో పాడేరు చేరుకొని అచ్చట మందిరంలో 45 నిమిషాలు పాటు నామ సంకీర్తన చేసి అనంతరం అక్కడికి చేరుకున్న 50 మంది ఎంపిక కాబడిన గిరిజనుల కుటుంబాలకు ఈ యొక్క కిట్లు పంపిణీ చేయటం జరిగింది. ఇటువంటి మంచి సేవా కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన శ్రీ సత్య సాయి సంస్థలు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు గణేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఇంతటి మహోన్నతమైన సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చిన ఎండాడ సత్యసాయి మందిరం సభ్యులకు, దాతలకు, ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనటానికి బస్సులో ప్రయాణమైన 23 మంది సాయి సోదర సోదరీమణులకు, బాలవికాస్ పిల్లలకు స్వామివారి దివ్య కృప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ,కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్వీనర్ వెంకట రామకృష్ణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు. అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాడేరు మందిరం నందు స్వామివారి ఫోటో జ్ఞాపకలను జిల్లా సేవాదళ్ సమన్వయకర్త ప్రతాప్ గారు బహుకరించటం చాలా ఆనందదాయకంగా ఉందని , ఇటువంటి సేవా కార్యక్రమంలో ఎన్నడు పాల్గొనలేదని,ఈ విధంగా ఈ సేవలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నట్లు ఎండాడ మందిరం సభ్యులు పేర్కొన్నారు.