యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం ఎంతో అభినందనీయం... మీరు మరి కొంతమంది యువతకు ఆదర్శం .యువత పెడదారి పట్టకుండా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి ---ఈగల్ ఏ ఎస్ పి. సి. హెచ్ శ్రీనివాసరావు పిలుపు.

*
 విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )

(నేడు(20.8.2026)* విజయనగరం జిల్లా) రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆవరణలో *ఈగల్ టీం ఆద్వర్యంలో* గురువారం వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది *గాయత్రి,SSSS, చైతన్య,సత్యా డిగ్రీ కాలేజీల* విద్యార్థులు పాల్గొని 48 బాగ్ లు ఇచ్చి తమయొక్క ఔదార్యాన్ని చాటారు.ఈగల్ అడిషనల్ సూపరెండేంట్ ఆఫ్ పోలీస్(ASP) *CH శ్రీనివాసరావు గారు* ముఖ్య అతిథిగా విచ్చేసి ఈగల్ *ఐ జి.* రవికృష్ణ గారి ఆదేశాల మేర బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశామని, డ్రగ్స్ కు, సెల్ లకు అలవాటుపడి పాడైపోతున్న యువత ఎక్కువగా ఉన్న నేటి రోజులలో స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేయడం అభినందనీయం అని కొనియాడారు.రెడ్ క్రాస్ చైర్మన్ *కంది వెంకటరమణ* మాట్లాడుచు డ్రగ్స్ , నిర్ములనకు నిరంతరం శ్రమిస్తున్న ఈగల్ డిపార్ట్మెంట్ సిబ్బంది సేవకార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి వారి సామాజిక బాధ్యత నెరవేర్చడం వారి నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈగల్ సబ్ ఇన్స్పెక్టర్ *ఎస్.స్వీటీ* ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల ఈగల్ టీం కార్యక్రమం విజయవంతంలో కృషిచేశారు
రెడ్ క్రాస్ కార్యదర్శి కె.సత్యం,జిల్లా కోశాధికారి Dr పొగిరి విశ్వేశ్వరరావు, మెనేజింగ్ కమిటీ మెంబర్లు వై.వీర్రాజు, బి.రామకృష్ణారావు PRO పి.దుర్గాప్రసాద్ రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
*కంది వెంకటరమణ*
జిల్లా ఛైర్మన్
*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ*
విజయనగరం.