వాసవి...
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం జిల్లా,
వి 201 ఏ, రీజియన్ -2,
జోన్ -2
*వి ఆర్ కే జోన్ సోషల్* *2026*
కార్యక్రమం తేదీ 23 8.2026 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయం హాల్ నెంబర్ 2 నందు అద్భుతంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవియన్ గోల్డెన్ స్టార్ పులవర్తి శ్రీనివాస్ హాలు బయట ఏర్పాటుచేసిన వి సి ఐ వారి పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం సభ్యులందరూ జై వాసవి జై జై వాసవి అనే నినాదాలతో ఘన స్వాగతం పలికి హాల్ ఆవరణలో అమర్చబడిన సీట్లలో ఆసీనులైనారు. తదుపరి సభ్యులందరికీ హౌసీ గేమ్ నిర్వహించిన అనంతరం ప్రోగ్రాం చైర్ పర్సన్ వాసవియన్ శివరామకృష్ణ గారు ప్రోటోకాల్ అనుసరించి ముఖ్యఅతిథి, వాసవియన్ పులవర్తి శ్రీనివాస్ ప్రోగ్రాం అబ్జర్వర్ వాసవియన్ ఆదిమూలం తిరుపతిరావు లను ఫస్ట్ లేడీ ఆఫ్ ది జోన్, జోన్ చైర్ పర్సన్ మరియు అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులను వేదిక పైకి ఆహ్వానించినారు. తదనంతరం ఫస్ట్ లేడీ ఆఫ్ ది జోన్ వాసవియన్ శ్రీమతి నాగవేణి మరియు ముఖ్య అతిథి, అబ్జర్వవర్ వేదికను అలంకరించిన పెద్దలు కలసి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. అజెండాను అనుసరించి సభ్యులు జాతీయ పతాకాన్ని ముఖ్యఅతిథికి, వాసవి మాత పతాకాన్ని జోన్ చైర్ పర్సన్ కు అందచేసారు..ఎంవిపి కపుల్స్ అధ్యక్షులు వాసవియన్ కె వెంకట రమణమూర్తి గారు క్లబ్బు చేసిన కార్యక్రమాలగురించి తెలియపరిచినారు. తదనంతరం ప్రోగ్రాం చైర్ పర్సన్ శివరామకృష్ణ జోన్ చైర్ పర్సన్ వాసవియన్ కపుల్ స్టార్ వెంకట రామకృష్ణారావు గారి వ్యక్తిగత విషయములు తెలియజేసి సభకు పరిచయం చేసిన అనంతరం జోన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ తనకు బాధ్యతగా ఇచ్చిన ఎంవిపి కపుల్స్, మేఘాద్రి గడ్డ డైమండ్స్, కంచరపాలెం మరియు వైజాగ్ షావుకార్స్ మొదలైన క్లబ్బులు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ ప్రత్యేకించి ఎంవిపి కపుల్స్ క్లబ్ చేస్తున్న కార్యక్రమాల గురించి, అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులను కొనియాడినారు. ఈ కార్యక్రమం ఇంత అబ్దుతంగా జరగడానికి జిల్లా కోశాధికారి మరియు క్లబ్ చార్టర్ అధ్యక్షులు చెరుకు కృష్ణ ఉపాధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాసరావు చేసిన సలహాలు సూచనలు ఎంతో ఉపయోగ పడ్డాయని వారిని అభినందించారు
మిగిలిన క్లబ్బులు కూడా తనదైన శైలిలో కార్యక్రమాలు చేస్తున్నారని తెలియ చేసినారు. తర్వాత ముఖ్య అతిథి వ్యక్తిగత విషయాలు తెలియజేసి సభకు పరిచయం చేసినారు. ముఖ్యఅతిథి ఈ జోన్ సోషల్ కు రావడం చాలా ఆనందదాయకమని ఈ జోన్ లో ఉన్న క్లబ్బులలో ఎంవిపి కపుల్స్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందని అభినందిస్తూ మిగతా క్లబ్బులు కూడా ఆ స్థాయికి రావాలని క్లబ్ పి ఎస్ టి లకు సూచనలు, సలహాలు చేసినారు. తదనంతరం వివిధ స్థాయిలలో క్లబ్బులకు అవార్డుల బహూకరణ , మరియు హౌసి గేమ్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ముఖ్య అతిథి ,జోన్ చైర్ పర్సన్, అబ్జర్వర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్, కార్యదర్శి, కోశాధికారుల అవార్డులు వెంకటరమణమూర్తి, చంద్రశేఖర్ గుప్త నర్సింగరావులు ఎంవీపీ కపుల్స్ క్లబ్ కైవసం చేసుకోగా,ఫస్ట్ బెస్ట్ ప్రెసిడెంట్ కార్యదర్శి ,కోశాధికారిల అవార్డులు మేఘాద్రి గడ్డ డైమండ్స్ కు దక్కినాయి. బెస్ట్ క్లబ్ అవార్డులు కంచరపాలెం మరియు వైజాగ్ షావుకార్స్ చేజిక్కించుకున్నాయి. తదుపరి ముఖ్య అతిథి శ్రీనివాస గారికి, అబ్జర్వర్ ఆదిమూలం తిరుపతి రావు గారికి జోన్ చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు దంపతులకు జోన్ లో ఉన్న క్లబ్బులు అందరూ కలసి సాలువలతో చిరు సత్కారం చేసి బహుమతులు అందించినారు. తర్వాత చిరంజీవి నాట్య ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తదుపరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసినది. ఈ కార్యక్రమంలో పూర్వపు అధ్యక్షులు గోగుల నర్సింగరావు, బుడ్డెపు రామారావు, గ్రంధి కృష్ణారావు, మల్లేశ్వర గుప్తా మరియు వైస్ గవర్నర్ చెక్క చందన, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ చెరుకు శ్రీరామమూర్తి, జిల్లా సేవా కార్యక్రమాల కార్యదర్శి గరుడ రమణి,రీజన్ చైర్ పర్సన్ తమ్మన మానస, రీజియన్ సెక్రటరీ గోగుల కమల్ కుమార్ స్నేహపూర్వకంగా విచ్చేసి జోన్ చైర్పర్సన్ కు అభినందించినారు.