విశాఖ సిటీ సమితి, ఎండాడ లోశ్రీసత్యసాయి భజన మండలి కన్వీనర్ ఏవి రామకృష్ణారావు పర్యవేక్షణలో భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో ఎండాడ మందిరంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు... శ్రీమతి సుందరి శ్రీమతి అన్నపూర్ణ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఓం శ్రీ సాయిరాం...
తేదీ 28.08.2026 శుక్రవారం శ్రీ సత్య సాయి భజన మండలి ఎండాడ, విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారంను పురస్కరించుకొని ఉదయం 11 గంటలకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సాయి వరలక్ష్మీ వ్రతం శ్రీమతి సుందరి శ్రీమతి అన్నపూర్ణ ల నిర్వహణలో శాస్త్రోక్తంగా నిర్వహించినారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఇద్దరు మహిళలకు చీర జాకెట్టు పసుపు కుంకు పండ్లు ఇవ్వడం జరిగింది.తదనంతరం స్వామివారి అష్టోత్తర శతనామార్చన, భజనలు ఆలపించి ముందుగా లక్ష్మీదేవికి నక్షత్ర హారతి ఇచ్చి తదుపరి మంగళహారతితో కార్యక్రమం ముగింపు చేసినారు భక్తులు వివిధ రకముల పిండి వంటలు పులిహార దద్దోజనం చక్ర పొంగలి మొదలైన ప్రసాదములు నివేదన చేసినారు. వ్రతము అనంతరము భక్తులకు ప్రసాదములు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ వెంకట రామకృష్ణారావు, కృష్ణారావు గోపి, శంకరం, సూర్యనారాయణ రాజు, సూరి మరియు భక్తులు పాల్గొన్నారు