జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 7వ వార్డు అధ్యక్షుడు నాగోతి నరసింహ నాయుడును పార్టీ ఆత్మీయ సమావేశంలో ఘనంగా సన్మానించారు. జనసేన పార్టీ పీఏసీ (PAC) ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఆయనను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేకంగా అభినందించారు.
గతంలో జనసేన పార్టీ తరఫున స్థానిక ఎన్నికలలో పూర్తి స్థాయిలో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సేవలందించారని కొనియాడారు. కష్టకాలంలో సైతం పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, 7వ వార్డు పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి, సమగ్ర అభివృద్ధికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు.
ఈ సన్మానం నరసింహ నాయుడుకి మరింత ఉత్సాహాన్ని, భవిష్యత్తులో వార్డు ప్రజలకు మరిన్ని విస్తృత సేవలందించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని అయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.