విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి. జై జై వాసవి.
తేదీ 01.09.2026 మంగళవారం
వాసవి వారోత్సవాలలో భాగంగా గత పదిహేను సంవత్సరముల నుండి ఎంతో సామాజిక,సాంఘీక మరియు సాంస్కృతిక సేవలలో ముందుండి వాసవి క్లబ్, ఏం.వి.పి.కపుల్స్ క్లబ్బును స్థాపించి క్లబ్బు సభ్యులను ఏకతాటిపై నడిపిస్తూ అవసరమైన నిరుపేదల కుటుంబాలకు, విద్యార్థులకు అనేక గుప్త దానాలు చేస్తూ, అనాధ శరణాలయములలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి క్లబ్ ,ఏం.వి.పి. కపుల్స్ చార్టర్ అధ్యక్షులైన చెరుకు కృష్ణ గార్ని వారి సతీమణి కృష్ణకుమారి దంపతులను క్లబ్ సభ్యులు అతి ఘనంగా సన్మానించిరి. క్లబ్ అధ్యక్షులు వెంకట రమణమూర్తి వారి నిస్వార్థ సేవలను కొనియాడారు. ప్రోగ్రామ్ చైర్మన్ శివరామకృష్ణ గారు మాట్లాడుతూ జిల్లాలోనే ఏం.వి.పి
కపుల్స్ క్లబ్ అవసరమైన వారికి సేవలు అందచేయుటకు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ,రక్త దాన మరియు మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి చంద్రశేఖర గుప్తా,కోశాధికారి చెరుకూరి నర్సింగరావు,గ్రంధి కృష్ణారావు, పూసర్ల సూర్యారావు, మల్లేశ్వర గుప్తా, ,గోగుల నర్సింగరావు, గరుడా సన్యాసిరాజు,రమేష్ బాబు, ధర్మారావు, రెడ్డయ్య గుప్తా,మున్నగు వారు పాల్గొన్నారు