మమత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడపపడుచున్న మాతృ ప్రేమ వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకులు పంపిణీ... ఎంవిపి కపుల్స్ వాసవి క్లబ్ అనాధ శరణార్థులకు సేవ..

వాసవి క్లబ్ వారిచే అనాధ, వృద్ధాశ్రమాలలో సేవా కార్యక్రమాలు.
 విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) 
వి.సి.ఐ. వారి సూచనల ప్రకారం. వాసవి వారోత్సవాల్లో భాగంగా తేదీ 03.09.2026, గురువారం 3 వ రోజున వాసవి క్లబ్ ,ఏం.వి.పి. కపుల్స్ క్లబ్ వారు అనాధ శరణాలయం లో నిత్యావసర సామగ్రిని మమత చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడపబడుతున్న మాతృ ప్రేమ వృద్ధాశ్రమం నకు అందచేసిరి. ట్రస్టు ఛైర్పర్సన్ మమతా గారు మాట్లాడుతూ వాసవి క్లబ్ ,ఏం.వి.పి. కపుల్స్ వారు ఇటువంటి సేవా కార్యక్రమాలలో ముందు ఉంటారని అనేక సార్లు మా ట్రస్టు కి విలువైన సామాగ్రి మరియు నిత్యావసర సామగ్రిని అందచేశారని ఇంకా ముందుముందు కు ఈ ట్రస్ట్ ను ఆదుకోవాలి అని కోరారు. తదుపరి ధన్యవాదములు తెలిపిరి . క్లబ్ అధ్యక్షులు వెంకట రమణ మూర్తి, కార్యదర్శి చంద్రశేఖరగుప్తా, కార్యక్రమాల అధ్యక్షులు పాలూరి శివరామకృష్ణ మున్నగు వారు పాల్గొన్నారు