-----------------------
జై వాసవి.. జై జై వాసవి. అంతర్జాతీయ వాసవి క్లబ్స్ వారి సూచనల మేరకు వాసవి క్లబ్, ఏం.వి.పి. కపుల్స్ సభ్యులు ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రైల్వే న్యూ కాలనీ లో గల గవర్నమెంట్ హై స్కూల్ నందు అపార అనుభవం మరియు విద్యార్థులలో మంచి పేరు సంపాదించుకున్న ముగ్గురు ఉపాధ్యాయులను సత్కరించడం జరిగింది
1. శ్రీమతి T. పద్మజ గారు, హిందీ టీచర్
2. శ్రీ B. శివ ప్రసాద్ గారు జీవ శాస్త్రం టీచర్
3. శ్రీ B.రామారావు తెలుగు పండిట్...
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వెంకట రమణ మూర్తి, కార్యదర్శి చంద్ర శేఖర గుప్తా ,కోశాధికారి చెరుకూరి నర్సింగరావు, కార్యక్రమాల అధ్యక్షులు పాలూరి శివరామకృష్ణ, గత అధ్యక్షులు గోగుల నర్సింగరావు, బుద్దేపు రామారావు, గ్రంధి కృష్ణ రావు, ఉపాధ్యాయులు ప్రసన్న కుమార్ మున్నగు వారు పాల్గొన్నారు.