వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి 201 ఏ రీజియన్ 2జోన్ 2 ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో అల్లిపురం భీమ్ నగర్ లో వరద ఈశ్వర్ హేమంత్ కుమార్ బర్త్డే సందర్భంగా ఏ యు టి డి నిరాశ్రయుల వసతి గృహం లో నిరాశ్రయులైన నిరుపేదలకు పండ్లు పలహారం, అల్పాహారాన్ని అందజేశారు.

జై వాసవి ...జై జై వాసవి
 విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
తేదీ 24.10.2026 శనివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వి 201 ఎ, రీజియన్ 2, జోన్ 2 నందు గల వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో, అల్లిపురం, భీమ్ నగర్ ఏ యు టీ డి, నిరాశ్రయుల వసతి గృహ మందు 75 మంది వృద్ధులకు 
 క్లబ్ సభ్యులు వాసవియన్ వరదా ఈశ్వర హేమంత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా, వారి ఆర్థిక సహకారంతో, క్లబ్బు అధ్యక్షులు వెంకటరమణమూర్తినిర్వహణలో ఫలహార కార్యక్రమం ఏర్పాటు... టిఫిన్ తో పాటు ఆపిల్ పండు, అరటిపండు, బిస్కెట్ ప్యాకెట్, ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్బు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి నరసింగ రావు, జోన్ చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు, క్లబ్ సభ్యులు, వరదా హేమంత్ కుమార్, కామేశ్వరమ్మ పాల్గొన్నారు.
తదనంతరం హేమంత్ కుమార్ కి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ సభ్యులు కండువాతో సత్కరించి పండ్లు ఇవ్వడం జరిగింది.
క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ హేమంత్ కుమార్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని సేవా కార్యక్రమాలు మరిన్ని చేసే అవకాశాన్ని భగవంతుడు ఇవ్వాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యములు వాసవి మాత ప్రసాదించాలని కోరారు.