జీవీఎంసీ 8వ వార్డులో తెలుగుదేశం పార్టీ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిపిల్లా రేవతి విస్తృత ప్రచారం. ఇంటింట ప్రచారంలో దూసుకుపోతున్న రేవతి. సైకిల్ గుర్తుకే ఓటేయండి. పేదల గుర్తు సైకిల్ గుర్తు కు ఓటు వేసి గెలిపించండి ప్రార్థిస్తున్నరేవతి.

భీమిలి నియోజకవర్గం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ (: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
మధురవాడ,
వార్డును సర్వతోముఖాభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా  రేవతి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా గురువారం ఆమె గణేష్ నగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు కుంకుమ బొట్టు పెట్టి ఆశీస్సులు కోరారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న తనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ముఖ్యంగా మహిళలు "మేము నీ వెంట ఉన్నాము" అంటూ భరోసా ఇస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వార్డును మరింత అభివృద్ధి చేస్తానని పిల్లా రేవతి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.