ఎన్నికల నియమ నిబంధనలను పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా పాటించాలి..... నియమ నిబంధనలను తుంగలోకి తొక్కితే చట్టపరమైన చర్యలు తప్పవు --- విశాఖ నగర సిటీ పోలీస్ కమిషనర్.

కార్పొరేటర్ అభ్యర్థులతో ముఖాముఖి.

- ఎన్నికల నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే 

-పోలీస్ కమీషనర్ శంఖబ్రత బాగ్చి


 విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
గ్రేటర్ విశాఖ జోన్ 2 పరిధిలోని 6 నుండి 11 వార్డుల కార్పొరేటర్ అభ్యర్థులతో విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ బుధవారం సాయంత్రం ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

మధురవాడ కొమ్మాది జంక్షన్‌లోని శ్రీ సూర్య ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి అభ్యర్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కోరారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
అభ్యర్థులకు ఏవైనా అత్యవసర సమస్యలు లేదా ఇబ్బందులు తలెత్తితే నేరుగా తనను సంప్రదించవచ్చని, అత్యవసర సమయాల్లో 7995095799 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని భరోసా కల్పించారు.

ఈ సమావేశంలో డీసీపీ-1 మణికంఠ చందవోలు, నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ ఎస్. అప్పలరాజు, సీఐ జి. బాలకృష్ణ, ఎస్ఐలు డి. రాము, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.