జీవీఎంసీ 9 వా వార్డ్ లో కోటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగోతి రూప కుమారి విస్తృతంగా ప్రచారం...( జపాన్ భార్య) సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. సంక్షేమం అభివృద్ధి చేసి చూపిస్తాం.. తమదే విజయం రూప కుమారి.
మధురవాడ, వైజాగ్ ఎక్స్ప్రెస్: జీవీఎంసీ 9వ వార్డు పరిధి మిథిలాపురి కాలనీలో కూటమి బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి నాగోతి రూప కుమారి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పిల్లా వెంకటరావు వార్డులో విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా అందరినీ కలిసి తమ ఓటు సైకిల్ గుర్తుకే వేయాలని పేదల పక్షాన నిలబడే తెలుగుదేశం పార్టీకి ఓటి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నుండి తమకు విశేషమైన స్పందన లభిస్తుందని ఈ సందర్భంగా రూప కుమార్ తెలిపారు. తాము గెలిస్తే వార్డును సుందరవణంగా తీర్చి దిద్దుతామని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండి తోడుగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు.