జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి. ఢిల్లీలో జర్నలిస్టులపై దాడులు దుర్మార్గం. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి., జర్నలిస్టుల అక్రమ కేసులు ఎత్తివేయాలి.--- విశాఖ,గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్. ఏపీ బ్రాడ్ కాస్ట్ స్మాల్ అండ్ మీడియం చిన్న పేపర్స్ జర్నలిస్టు సంఘాల డిమాండ్. జర్నలిస్టు సంఘాల నేతల గంట్ల శ్రీనుబాబు,నారాయణ, ఇర్రోతి ఈశ్వరరావు

*ఢిల్లీలో జర్నలిస్టులపై దాడి అత్యంతదారుణం*

*పాత్రికేయుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి*

ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బ్రాడ్‌కాస్ట్
స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ జర్నలిస్టుల సంఘాల డిమాండ్

దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
,
 విశాఖ సిటీ,( ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: :
 సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )

ఆసీల్ మెట్ట..విశాఖ పట్నం.. అక్టోబర్ 14

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో  
భాగంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసుల తో పాటు పలువురు అనధికార వ్యక్తులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్.. ఏపీ బ్రాడ్‌కాస్ట్.
స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ జర్నలిస్టుల సంఘాల అసోసియేషన్లు ప్రకటించాయి. 
ఢిల్లీలో జర్నలిస్టులపై జరిగిన దాడులను నిరసిస్తూ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం మేరకు
బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పలువురు జర్నలిస్టులపై పోలీసులు దాడులకు పాల్పడటాన్ని దారుణంగా అభివర్ణించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం, కెమెరాలు, మైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం, వార్తా సేకరణకు ఆటంకం కలిగించడం పత్రికా స్వేచ్ఛపై దాడేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ లు మాట్లాడుతూ
జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించాలని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
రాజకీయాలతో సంబంధం లేకుండా విధుల నిర్వహణలో 
ఉన్న జర్నలిస్టులు రాత్రి పగలు తేడా లేకుండా సమాజ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు అన్నారు.. అటువంటి వారి సేవలను గుర్తించాల్సింది పోయి దాడులకు పాల్పడటం అత్యంత దారుణం అన్నారు.. దేశ రాజధానిలో ఇటువంటి దాడులు జరగడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందన్నారు..

కార్యక్రమంలో విశాఖ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు.. ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు.. మధు.. రాజేష్ రెడ్డి ఆడారి కొండలరావు. అప్పలనాయుడు.. బ్రాడ్ కాస్ట్ కార్యదర్శి కింతాడ మదన్.. మల్ల దేవ త్రినాథ్..శేషు..స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ కార్యదర్శి కే శ్రీనివాస్.. బొబ్బర ప్రసాద్....సభ్యులు పాల్గొని జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు.