భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
భీమిలి నియోజకవర్గం మధురవాడ, గ్రేటర్ 9వ వార్డు: జీవీఎంసీ 9వ వార్డు పరిధిలో అవార్డు కార్పొరేటర్ నాగోతి రూప కుమారి సత్యనారాయణ అవార్డులో ప్రధానమైన సమస్యలపై అప్పటికప్పుడు పరిష్కారమయ్యే సమస్యలపై దృష్టి సారించారు. కార్మికుల కష్ట సుఖాలతో పాటు మధురవాడ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాలపై మంచి అవగాహన ఉన్న సత్యనారాయణ ఆ సమస్యల పరిష్కారానికి నడుం బిగించాడు. ఉదయం వార్డులో రోడ్లు, కాలువలు, పారిశుధ్య నిర్వహణ, పై దృష్టి సారించి మంచినీటి సమస్యలు కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కృషి సల్పుతున్నారు. వాంబే కాలనీలో పారిశుధ్య నిర్వహణతో పాటు పోయిన హ్యాండ్ బౌలింగ్ లను మరమ్మతులు చేపట్టారు. తద్వారా కొంతైనా మంచినీటి సమస్య పరిష్కారానికి వెసులుబాటు కల్పించారు. మంచినీటి కొళాయిలు పైప్ లైన్లు మరమ్మతులు చేశారు. కొలప్స్ అయిపోయిన మురుగునీటి అండర్ గ్రౌండ్ మ్యాన్ హోల్స్ క్లీనింగ్ చేసి మరమ్మతులు చేశారు. వాంబే కాలనీ పురవీధుల్లో తిరుగుతూప్రజా సమస్యలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఆ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అర్హులైన వికలాంగుల పెన్షన్ల మంజూరు చేసేందుకు తగిన కృషి చేస్తున్నారు. అంధకారంలో ఉన్న వాంబే కాలనీలో, పాత మధురవాడలో వీధి దీపాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. పాత మధురవాడలో ఇప్పటికే రెండుసార్లు పర్యటించారు. వీధి దీపాలు, కాలువలు, కమ్యూనిటీ హాల్, అంగనవాడి కేంద్రం వంటి సమస్యలు స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తక్షణ పరిష్కారం చేసే పనులు వీధి దీపాలు పారిశుధ్యం పనులు ఇప్పటికే చేస్తున్నారు. వార్డులో పలు సమస్యలపై అనుభవం ఉన్న (జపాన్ సత్యనారాయణ) వార్డు అభివృద్ధికి ఆనతి కాలంలోనే ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో వాటి పరిష్కారాన్ని కృషి చేయడంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో అడుగులు వేస్తున్న జపాన్ చేసే కృషి పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.