చంద్రంపాలెం శిల్పా రామంజాతర గట్టు పై వెలసిన కోరినకోర్కెలు తీర్చే దుర్గాలమ్మ ఆలయంలో భవానీలకు, అయ్యప్ప స్వామీలకు, అన్నదానం. గురుస్వాములు అన్నమయ్య వెంకటరమణ, శ్రీను. దుర్గాలమ్మ ఆలయ అధ్యక్షులు పిల్లా సూరిబాబు .

తేదీ: 27.11.2026
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో కార్తీక మాసం మూడవ శుక్రవారం సందర్బంగా విశేష కుంకుమ పూజలు!

600 మంది అయ్యప్ప స్వాములు, భవానీలు, భక్తులు, పేదలకు అన్నసంతర్పణ!
భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
మధురవాడ, నవంబర్ 27 
విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు వద్ద కొలువై ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ షిర్డీ సాయినాథుని సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీకమాసం కృష్ణ పక్షం తదియ శుక్రవారం విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం నిత్యార్చనలతో ప్రారంభమైన పూజా కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, పుష్పార్చన తదితర పూజలను ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, పట్నాల మూర్తి శర్మ తదితరులు నిర్వహించారు. అనంతరం కర్పూర హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. 
సాయంత్రం అమ్మవారికి పంచామృత, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, నైవేద్య సమర్పణ అనంతరం కర్పూర హారతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపారాధన సేవల్లో పాల్గొన్నారు.

ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నసంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శుక్రవారం బొబ్బిలి వాస్తవ్యులు దుబాయ్ నివాసం వుంటున్న శ్రీనివాసరావు, చంద్రావతి దంపతుల కుమారుడు విద్యా చరణ్ జన్మదిన దినం (కుటుంబ సభ్యులు సహాయ సహాకారాలతో) సందర్బంగా 600 మంది అయ్యప్ప స్వాములు, భవానీలు, భక్తులు, పేదలకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు,

అదే విధంగా సాయి ప్రియా గార్డెన్ వాస్తవ్యులు శ్రీనివాస వరప్రసాద్, సత్యవేణి దంపతులు, గంగాధర్ సుధీర్, రమ్యలక్ష్మి తదితరులు అందించిన ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన పులిహోర ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీదుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పిళ్లా పోతరాజు, పిళ్లా మోహన్ శివకృష్ణ, జనరల్ సెక్రటరీ నాగోతి తాతారావు, సెక్రటరీ పోతిన పైడిరాజు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి పిళ్లా వెంకటరమణ, దుక్క వరం, జాయింట్ సెక్రటరీ పోతిన శివ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పొట్నూరి హరికృష్ణ, మీడియా ఇన్చార్జి బోగవిల్లి రాము, సోషల్ మీడియా ఇన్‌చార్జి మరుపిల్లి ఆనంద్

 చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు,

కమిటీ సభ్యులు పిళ్లా రమణ, దుర్గాశి సోంబాబు, కేశనకుర్తి అప్పారావు, పిళ్లా రాజు, పిళ్లా గోకుల్, పీస వెంకట లోకేష్ 

ముఖ్య సభ్యులు నాగోతి అప్పారావు, పిళ్లా వెంకటరమణ, పిళ్లా అప్పన్న, పొట్నూరి వాసు, శంకాబత్తుల శ్రీను, పిళ్ళా రాజు, జగుపిల్లి శివ, గుజ్జారి సింహాచలం, పోతిన రాంబాబు, అయ్యప్ప మాల ధరించిన స్వాములు, భవానీ మాలధరించిన భవనీలు ఆలయ సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.