Delhi Lo karmika porataniki sangi bhavam thela pandi-citu

డిల్లీ లో కార్మిక పోరాటానికి సంఘీభావం తెలపండి.
సిఐటియు..
Visakha City, Praja balam news online:( senior journalist manam Srinu madhurawada)
కార్మికులు,ఉద్యోగులు హక్కులకు రక్షణతో పాటు,నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్ డిమాండ్ చేశారు. డిసెంబరు 1,2,3,తేదీలలో డిల్లీ లో భారీ ఎత్తున కార్మిక వర్గం సిఐటియు ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమయిందని తెలియజేశారు. ఈ పోరాటానికి ప్రజలు కార్మికులు అర్చకులు ఉద్యోగులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోరాటానికి ప్రజల మద్దతు కోరుతూ,ప్రజలపై భారాలను వ్యతిరేకిస్తూ కొమ్మాది కోడలి వద్ద గురువారం భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించారు.ఈ ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోను, రాష్ట్రంలోను పాలకులకు కార్పొరేట్ వ్యాపారులు ప్రయోజనాలు తప్ప కార్మికులు,సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు,సమస్యలు పట్టవని దుయ్యబట్టారు. బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలు ప్రజల కు విద్యా,వైద్యం అందకుండా కార్పోరేటికరించాయని ఆవేదన వ్యక్తం చేశారు.భూములు,వనరులు కారు చౌకగా దోచిపెడుతున్నాయని విమర్శించారు.పరియ వరణాన్ని నాశనం చేసే విధంగా డేటా సెంటర్లకు అనుమతులు ఇవ్వడం అన్యాయమని అన్నారు.డిల్లీ పోరాటానికి సంఘీభావం తెలపడం తో పాటు,డిసెంబరు 2న జీ వి ఎం సి గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం జరుగుతుందని కార్మికులు,ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జోన్ అధ్యక్షులు డి అప్పలరాజు,నాయకులు పి రాజ్ కుమార్,ఎస్ రామప్పాడు, జీ కిరణ్, జీ విజయ్,కృప,పి వరలక్ష్మి, ఎం ఆదిలక్ష్మి, పాల్గొన్నారు.