పేదల పాలిట సంజీవిని 104 --- భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.
భీమిలి నియోజకవర్గం - జీవియంసి 1వ వార్డు (తగరపువలస) మంగళవారం
తగరపువలస బంతాట మైదానంలో ఈరోజు 104 అంబులెన్స్ ను మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతులు మీదుగా జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి పేదల పాలిట దైవం అయిన స్వర్గీయ వైస్ రాజశేఖరరెడ్డి ఆలోచన లో పుట్టిన వాటిలో మొదటిది ఆరోగ్య శ్రీ అయితే, రెండవది అంబులెన్స్ సేవలు అని పేదల ప్రజలు ఆరోగ్యం వైద్యం విషయంలో రాజన్న ఒక అడుగు వేస్తే,ఆయన తనయుడుజగనన్న పది అడుగులు వేసి ప్రతీ గ్రామాలలో జీవియంసి వార్డు లలో మౌళిక సదుపాయాలు తో వైద్య పరికరాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మాణాలు చేపట్టడం చేసారని వాటికి అనుసంధానంగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అది అనుకోకుండా జరిగే ప్రమాదం కావచ్చు అనారోగ్య ప్రాణాపాయ పరిస్థితి కావచ్చు,గర్భిణీ స్త్రీలకు ఇలా ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ అంబులెన్స్ (104 ) ఇలాంటివి ప్రవేశ పెట్టి ప్రతీ పేదవాడికి మెరుగైన వైద్యం అందించడం లో ముందున్నారని ఇందులో భాగంగా అందరికి ఉపయోగపడి ప్రాణదాత లాంటి ఈ 104 ను ప్రారంభించడం చాలా సంతోషం గా ఉందని, పేదలు కోసం పాటు పడే నిజమైన నాయకుడుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోనే చూసానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అదికారులు భీమిలి నియోజకవర్గం వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.