విశాఖపట్నం--- ఇసుకతోట సర్వీస్ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎఐటియుసి ఆధ్వర్యంలో ఇసుకతోట జంక్షన్లో నిరసన ధర్నా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా కార్యదర్శి జి వా మన మూర్తి మాట్లాడుతూ మద్దిలపాలెం టు ఎంవిపి కాలనీ కి వెళ్లే జాతీయ రహదారి ఆనుకొని ఉన్న ఇసుకతోట సర్వేస్ రోడ్ లో స్పీడు బ్రేకర్ లేకపోవడంతో బస్సులు లారీలు కార్లు ఇతర వాహనాలు అతివేగంతో దూసుకు రావడంతో ఉదయం సాయంత్రం సర్వీస్ రోడ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఇసుకతోట గ్రామ ప్రజలు రోడ్డు దాటాలంటే ప్రాణం కోల్పోతామన్న భయంతో ప్రజలు ఆందోళన గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారులు నగర ట్రాఫిక్ పోలీస్ వారు వెంటనే ఇసుకతోట సర్వీస్ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సర్వీస్ రోడ్లో బస్సులు లారీలు ఇతర భారీ వాహనాలను నిషేధించి వృద్ధులు వికలాంగులు గ్రామ ప్రజలు భవన నిర్మాణ కార్మికులకు నిర్మాణ కార్మికులకు ప్రాణ రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, లేని పక్షంలో ఏ ప్రమాదం జరిగినా దానికి పూర్తి బాధ్యత నగరంలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ ధర్నాలో ఎం గోవిందు సిపిఐ నాయకులు రావి కృష్ణ మరడ రమణ గడ్డం రాము పి కృష్ణ పి రామమ్మ డి రామారావు కే దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.