భూమి పూజ చేస్తున్న విశాఖ జిల్లా పశుగణాభివృద్ధి చైర్మన్ వెంకటప్ప

 భూమి పూజ కార్యక్రమం లో పశుగణాబివృద్ది చైర్మన్


భీమిలి మండలం - సింగనబంద - బుదవారం


విశాఖ జిల్లా పశుగణాబివృద్ది చైర్మన్ గాడు వెంకటప్పుడు అధ్యక్షతన సింగనబంద పంచాయతీ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వికాస సమితి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది.


కార్యక్రమం లో బాగంగా వేదపండితుల మంత్రోచ్చారణ మద్య సర్పంచ్ గాడు వెంకట నారాయణ భూమి పూజ చేసి ఆ మట్టిని రైతులకి అందజేయడం జరిగింది


కార్యక్రమం ను ఉద్దేశించి గాడు వెంకటప్పుడు గారు మాట్లాడుతూ ఒకనాటి వ్యవసాయ సాగు కి నేటి తరంలో వ్యవసాయ సాగు మద్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అప్పట్లో సహజ సిద్ధమైన పకృతి ఎరువులు విత్తనాలు ను వాడే వారిని వాటి వలన పంట పుష్కలంగా పండి రాబడి తో పాటు మనుషులు కూడా శారీరకంగా ఆరోగ్యం గా మానసికంగా ఉల్లాసంగా ఉండే వారిని నేటి రసాయన ఎరువులు వలన సరైన వ్యవసాయ సాగు పంట బాగోలేక పోవడంతో పాటు లాభసాటి లేక వ్యవసాయం దండుగ అనే పరిస్థితి కి వచ్చామని అలనాటి సాగు రోజులు కావాలి వ్యవసాయం దండుగ లా చేయాలి అంటే రైతులు అందరూ సేంద్రీయ విధానాన్ని అవలంబించాలని సూచిస్తూ ఈ విధానంపై మీకు అవగాహన లేకపోతే సంఘ్ పరివార్ వారు మీకు ఉచిత శిక్షణ అందిస్తారని ఈ శిక్షణ వలన వ్యవసాయం ని లాభసాటిగా చేయవచ్చునని మాట్లాడారు


అనంతరం గ్రామ వికాస సమితి వారి ఆధ్వర్యంలో కార్యాచరణ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది


ఇంత చక్కటి ఉచిత శిక్షణ తరగతులు అందిస్తున్న సంఘ్ పరివార్ వారికి వెంకటప్పుడు పంచాయతీ నాయకులు రైతులు దన్యవాదాలు తెలిపారు


ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ వికాస సమితి సంఘ్ పరివార్ తిరుపతయ్య గారు - పంచాయతీ నాయకులు రైతులు పాల్గొన్నారు.