మహిళా సంక్షేమానికి పెద్ద పీఠ వేసిన జగనన్న.

 మహిళా సాధికారకత జగనన్నతోనే సాద్యం అవంతి.


భీమిలి నియోజకవర్గం - జీవియంసి 1వ వార్డు - మంగళవారం


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న వైయస్సార్ ఆసరా కార్యక్రమం 1వ వార్డు కి సంబందించిన లభ్థిదారులతో తగరపువలస బంతాట మైదానంలోనిర్వహించారు.


ఈకార్యక్రమం లో బాగంగా మహిళల అభ్యున్నతి పాటుపడుతున్న జగనన్న చిత్ర పటానికి లబ్దిదారు మహిళలు పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగాఅవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ 3వ విడత వైయస్సార్ ఆసరా జీవియంసి 1వ వార్డు పరిధిలో 285 పొదుపు సంఘాలలో ఉన్న 2668 మంది లభ్థిదారులకు 1కోటి 95 లక్షలు రూ నేరుగా వారి ఖాతాల్లో కి వేయడం జరిగిందని భీమిలి నియోజకవర్గం లో చూసుకుంటే వైసిపి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి క్రింద 227 పనులకు 35 కోట్లు రూ ఖర్చు చేయడం జరిగిందని సంక్షేమం పరంగా 12,247 సంఘాలకు 28 కోట్ల రూ అందించడం జరిగిందని గత ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తానని సున్నా వడ్డీ అందిస్తానని చెప్పి మాటలు వరుకే పరిమితం చేసి చేతల్లో చూపలేదని జగనన్న మాత్రం మాట తప్పకుండా సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా గడప గడపకు వాలంటీర్లు వ్యవస్థ ద్వారా నేరుగా అందించాలని ఆయనకు పేద ప్రజల పట్ల ఒక నిబద్దత చిత్తశుద్ధి ఉందని, మహిళలను గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకు గా చూసి గెలిచాక పల్లకి మోసేవారిలా చేస్తే జగనన్న ప్రభుత్వం లో మహిళలు కు పదవులు రిజర్వేషన్ లు కల్పించి ఉన్నత పదవుల్లో అలాగే నామినేటెడ్ పదవుల్లో కూర్చోబెట్టి పల్లకిలో ఎక్కేవారిగా చేసారని, ప్రజలు బాగు కోసం నిజాయితీ గా నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే అని పేదల జీవన విధానం మెరుగుపడాలంటే అది ఒక్క జగనన్న తోనే సాద్యం అని రాబోయే ఎన్నికలు పేదవారికి పెత్తందారులకి మద్య పోరాటం కనుక పేదవారు మద్య తరగతి వారు బడుగు బలహీన వర్గాల వారు మహిళలు అంతా జగనన్న పక్షాన నిలిచి ఆయన్ని గెలిపించాలని ఆయన మరల ముఖ్యమంత్రి అయితే మరింత సంక్షేమ పాలన అందించడం జరుగుతుందని దానికి మీ మహిళలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు


అనంతరం 1వ వార్డు లో గల 2668 మంది 3వ విడత వైయస్సార్ ఆసరా లబ్దిదారులకు 1కోటి 95 లక్షల చెక్కును ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా అందజేశారు.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు 1వ వార్డు వైసిపి శ్రేణులు నాయకులు కార్యకర్తలు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు లభ్దిదాలులు పాల్గొన్నారు.