g20 సమ్మిట్ లో భారత కార్మిక సమస్యలపై చర్చించాలి.

 విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ జి20 సమ్మిట్ లో భారత కార్మిక వర్గ సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం ఈనాడు రైతు బజార్ ఎదురుగా జంక్షన్ లో ఏఐటీయూ సి ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనుమూర్తి మాట్లాడుతూ విశాఖపట్నంలో మార్చి 28 29 30 తేదీల్లో జరుగుతున్న అంతర్జాతీయ జి 20 సదస్సులో భారత కార్మిక వర్గ సమస్య నిరుద్యోగం కార్మిక చట్టాలు ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ మరియు పెంచిన నిత్యవసర ధరలు రైతంగ సమస్యల పైన విశాఖలో జరుగు g20 అంతర్జాతీయ సదస్సులో సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు 10 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదాని అంబానీ వేదాంత గ్రూపులకు రాయితీ ఇచ్చి దేశ ప్రజలపై ధరల భారాలు జీఎస్టీ పన్నులు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వ విధానాలపై g 20 సదస్సులో చర్చించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో సిపిఐ నాయకులు రామకృష్ణ ఆటో సంఘం నాయకులు జి శ్రీనివాస్ కే ఆనంద్ రెడ్డి పీతల శంకరు డి మోహన్ శేఖరు ఈశ్వరరావు కే ఉమా శంకర్ సుధీరు ధారబాబు కృష్ణం నాయుడు తదితరులు పాల్గొన్నారు.