రాహుల్ గాంధీకి అండగా ఉంటాం.

 పార్లమెంట్ లో ప్రజాసమస్యలపై రాహుల్ గాంధీ గారు బీజేపీని ప్రశ్నించిద్దనే అనర్హత వేటు వేశారు- డాక్టర్ రాంచందర్ నాయక్*


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం-డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి&పిసిసి సభ్యులు డాక్టర్ రాంచందర్ నాయక్.


రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ వచ్చిన గెజిట్ పై డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి&పిసిసి సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తున్న ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ.....???*




దేశంలో పెరిగిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలపై,దేశాన్ని కుదిపేస్తున్న ఆదాని-హిండెన్ బర్గ్ అంశం పై పార్లమెంటల్ లో మాట్లాడొద్దనే ఉద్దేశంతోనే బీజేపీ ఇలా చేసింది.


కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసింది ఆదానిక చౌకీదారు దుష్ట సంఘీ నిజం ఎప్పటికీ ఓడిపోదు.



ఆదాని వ్యవహారంపై జెపిసికి పట్టు పట్టినందుకు కక్ష సాధింపు చర్యలకు బిజెపి పాల్పడుతుంది. నిజాలు మాట్లాడే వారిని బయటకు గెంటేసే చర్యలకు బిజెపి దిగుతుందని రాంచందర్ నాయక్ మండిపడ్డారు..


రాహుల్ గాంధీ కి పదవులు కాదు ముఖ్యం ప్రజల సమస్యలే ముఖ్యం


దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాత్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీ ది.


భవిష్యత్ కార్యాచరణ పై త్వరలో ఏఐసీసీ నిర్దేశించిన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్న కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నియంతలాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ అగ్రనేతపై కక్షపూరితంగా వ్యవహరించి కోర్టులలో న్యాయవాదులను మార్చి తప్పుడు నివేదికలతో రాహుల్ గాంధీ గారి పై జైలుకు పంపే కుట్ర చేస్తున్నది.



అవినీతిపరులు వడ కంపెనీదారుల కు వత్తాసు పలుకుతూ కక్షపూరిత ధోరణి వ్యవహరిస్తున్నారు.



ఇటువంటి సంఘటనలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు మీరు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.



రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా,నాయకుడిగా మేము అండగా ఉంటాము.