ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ లు కావాలి..
మధురవాడ --- ---మన దేశంలో ప్రజలందరూ సమనత్వంతో జీవించాలంటే భగత్ సింగ్,రాజ్ గురు,సుఖదేవ లు
కావాలని వక్తలు ఉద్బోధించారు.వీరి 92వ వర్ధంతి సందర్భంగా సీఐటీయూ డి వై ఎఫ్ ఐ,ఐద్వా,వి సి సి
ఆధ్వర్యంలో కొమ్మాది కూడలి నుండి మధురవాడ
మీదుగా అంబేధ్కర్ విగ్రహం వరకు కాగాడాల ప్రదర్శన
గురువారం నిర్వహించారు.
అనంతరం వక్తలు మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్య వాదుల దుష్ట పాలన అంతం చేసి ప్రాణాలర్పించి
మన దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే,నాడు ఆ బ్రిటిష్ సామ్రాజవాదులకు తొత్తులుగా మారి, స్వతంత్ర ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన వారు నేడు మనదేశంలో పరిపాలన చేస్తున్నారని అన్నారు.
అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశ సంపదను కొల్లగొట్టుకుపోతే, నేడు మన దేశంలో బిజెపి పాలకులు మన మన దేశ సంపదను వనరులను భూములను ఎదెచ్చగా విదేశీ స్వదేశీ బడా పెట్టుబడిదారులకు, మోసగాళ్లకు దోచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశానికి ,ప్రజలకు, మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది అన్నారు.
అందుకే మన దేశ ప్రజలందరూ భగత్ సింగ్, రాజ్ గురు,శుకుదేవ్ ల స్పూర్తితో మన దేశాన్ని,ప్రజలను కాపాడు కొనడానికి
ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి అప్పలరాజు, డి కొండమ్మ,
ఐద్వా నాయకులు బి భారతి, కే సుజాత, వి సి సి కార్యకర్తలు పి రామరాజు, ఎస్ బద్రి, డి వై ఎఫ్ ఐ నాయకులు డి ఉమశైలజ, బి ఉష, నరేంద్ర, జి కిరణ్, సిహెచ్ శేషు, ఎస్ రామప్పడు తదితరులు పాల్గొన్నారు.