7వ వ వార్డ్ లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
మధురవాడ ---- ---జీవీఎంసీ 7వ వార్డ్ పరిధి మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి అవార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ పూలమాల వేసి
ఘన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఈ కార్యక్రమం లో టిడిపి సీనియర్ నాయకులు పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు ,బోయి వెంకటరమణ( శ్రీను) తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ మంగమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రo లో రాక్షస పాలన నడుస్తోందని రాష్ట్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లోతెలుగుదేశం పార్టీ అధికారం లోకి రావడం తధ్యమని కావున కార్యకర్తలు అందరూ ఎలాంటి నిరుత్సాహం పడొద్దని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నేత పోతిన నాయుడు, ఆ కార్యదర్శి అచ్యుతరావు, ఆ వార్డ్ అధ్యక్షుడు పిల్ల నర్సింగరావు, నాగోతి సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.