పార్కు అభివృద్ధి కి శంకుస్థాపన చేసిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.
మధురవాడ ---ప్రజా బలం న్యూస్
భీమిలి నియోజకవర్గం - జీవియంసి మదురవాడ జోన్ 02 - 8వ వార్డు -
భీమిలి నియోజకవర్గం పరిదిలో గల మదురవాడ జోన్ 8వ వార్డు ఎండాడ వై యల్ఫి లే అవుట్ సాంస్కృతిక స్కూల్ వద్ద అంచనా విలువ 134.00 లక్షలు రూ నిధులతో పామ్ గార్డెన్ థీమ్ పార్క్ అభివృద్ధి, మౌళిక సదుపాయాలు కల్పించుటకై మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతులు మీదుగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన పార్కును సందర్శించి అవగాహన ఏర్పాటు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జోన్ టు కమీషనర్ కే కనకమహాలక్ష్మి. ప్రభుత్వ అధికారులు - జీవియంసి 8వ వార్డు వైసిపి శ్రేణులు ఆ వార్డ్ వైసీపీ అధ్యక్షుడు ఎల్ రామ్మోహన్రావు, గోపి, అల్లాడ ఉమామహేశ్వరరావు, సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు - పాల్గొన్నారు.