రెవిన్యూ మంత్రి ధర్మాణ ప్రసాదరావు కుమారుడు భూమికి వేస్తున్న రహదారి తక్షణమే నిలుపుదల చేయాలి !
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు
మధురవాడ--- ప్రజాబలం న్యూస్--- జీవీఎంసీ 5 వ వార్డు పరిధిలో గల విశాఖపట్నం రూరల్ మండలం పరదేశిపాలెం సర్వే నెం 187/1 లో రాష్ట్ర రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రాంమనోహర్ నాయుడు పేరుతో ఉన్న "వర్ణిన్ డాక్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన 4.39 ఎకరాలు భూమికి జీవీఎంసీ నిధులతో వేస్తున్న రహదారి వెంటనే అపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు డిమాండ్ చేశారు.
జీవీఎంసీ కమిషనర్ కు లిఖిత పూర్వకంగా శనివారం ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ ఈ భూమిని వాసుపల్లి సత్తయ్య మాజీ సైనికుడు అని అతని పేరున ఒక నకిలీ పట్టా సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర రెవిన్యూ మంత్రి ఇప్పటి రెవిన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు తమ పదవిని ఉపయోగించుకొని జిల్లా, కలెక్టర్ ద్వారా ఎన్ ఓ సి ఇప్పించుకొని భూమిని అన్యాక్రాంతం చేశారని, భూమి కబ్జాకు గురైన వివరాలతో నాడు సీపీఐ తరుపున 2017 అప్పటి ప్రభుత్వం నియమించిన సిట్ కి పిర్యాదు నెం 2287/7-20-2017గా ఇచ్చాము. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఐ ఎ ఎస్ అధికారి వై వి అనురాధ గారితో నియమించిన సిట్ కి పిర్యాదు కూడా చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇది సిట్ దర్యాప్తు లో ఉన్నదని, ఇంకా నివేదిక బయటకు ప్రభుత్వం పెట్టకముందే ఆ భూమికి జీవీఎంసీ నిధులతో రహదారి నిర్మించడం సరియైనది కాదని వెంటనే ఆ రహదారి నిర్మాణం అపాలని సిపిఐ విశాఖ జిల్లా పార్టీ తరుపున డిమాండ్ చేశారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్భుతో రహదారి నిర్మాణం చేపట్టడం అక్రమమని ఆరోపించారు. ప్రభుత్వ పక్షాన ఉండి ప్రజా ఆస్తులకు సంరక్షణ కోసం పనిచేయాల్సిన అధికార యంత్రాంగం ఇలాంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గపు చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా జీవీఎంసీ యంత్రాంగం స్పందించి రోడ్డు నిర్మాణం నిలుపుదల చేయాలని కోరారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు ఎం.మన్మధరావు, ఎన్. నాగభూషణం తదితరులు పాల్గొన్నారు