సాయిరాం కాలనీలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 భీమిలి నియోజకవర్గం --మధురవాడ (ప్రజాబలం న్యూస్ )-- 5వ వార్డు. 

 సాయిరాం కాలనీ లో.. 


 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. 

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ 5వవార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.. మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు  పాల్గొని జాతీయ జెండాని ఎగర చేశారు. 

 ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ.. 

  ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితమే ఈరోజు స్వతంత్రంగా బతుకుతున్నామని పేర్కొన్నారు.

 ఆ మహనీయులు ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ దేశభక్తి తో మెలిగి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు.. 

 అన్ని రంగాలలో ప్రగతి సాధిస్తున్న మన దేశం భవిష్యత్ లో మరింత అభివృద్ధి జరిగే విధంగా ఐకమత్యంగా పనిచేయాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటైన మనం అభివృద్ధి చెందిన దేశాలలో చేరడానికి యువత దేశభక్తితో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలనిఆకాంక్షించారు. 

 ఈ కార్యక్రమం సాయిరాం కాలనీ నాయకులు శ్రీ జోజి బాబు, జగన్నాథం, వీర్రాజు, ఎన్ వెంకట్రావు, జి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో వైయస్సార్  పార్టీ నాయకులు కార్యకర్తలు కన్వీనర్లు గృహ సారధులు అభిమానులు పాల్గొన్నారు.