మధురవాడ సబ్ రిజిస్ట
ర్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మధురవాడ (ప్రజాబలం న్యూస్) ఆగష్టు 15:మధురవాడ మిదిలాపురి ఉడాకాలనీ లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారంంం ఉదయం ఘనంగా నిర్వహించారు. మధురవాడ సబ్ రిజిస్టర్ మోహన్ రావు జాతీయ జెండా ఎగరవేశారు. జాతీయ గీతం ఆలాపన చేసిన అనంతరం ఆయన స్వాతంత్ర దినోత్సవం ప్రతీ ఏటా ఆగష్టు 15 వ తేదీన ఎందుకు చేసుకుంటున్నాం అనే విషయాన్నీ గుర్తుచేస్తూ, ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు ప్రాణ త్యాగాలు చేస్తే మన భారత దేశానికీ 1947 ఆగష్టు 14 వ తేదీ అర్ధరాత్రి బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి వెళ్లిన అనంతరం భారత దేశానికీ ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నామని చెప్పారు.. మనం భారత దేశంలో ఎక్కడ ఏమూలన పనిచేసిన విధి నిర్వహణలో చక్కని ప్రతిభ కనబరచి మంచి వ్యక్తిత్వంతో అందరి మన్ననలు పొందేవిధవిధంగా నడుచుకోవాలని చెడు అభిప్రాయాలను, బేదాభి ప్రాయాలను విడనాడి విధినిర్వహణలో స్నేహాభావంతో మెలగాలని సూచించారు. అనంతరం సిబ్బందికి స్నేహాభావంతో మిటాయిలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మధురవాడ సబ్ రిజిస్టర్ సీనియర్ అసిస్టెంట్ శేఖర్, ఆనంద్, చిల్లర వర్తకులు.తదితర సిబ్బంది పాల్గొన్నారు.