మధురవాడ -- ప్రజాబలం న్యూస్
ఘనంగా 5 వ వార్డ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!.
మధురవాడ--- ప్రజాబలం న్యూస్ --- 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 5వ వార్డు పరిధిలో బొట్టవానిపాలెం,స్వతంత్రనగర్, నగరంపాలెం, సాయిరామకాలనీ,రాజీవ్ గృహకల్ప,వైయస్సార్ కాలనీ, శివశక్తినగర్, గాంధీ నగర్, సద్గురు సాయినాథ్ కాలనీ లలో వివిధ సచివాలయాలు,ఎం.పీ.పీ. పాఠశాలలలో.... పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకమిటీలు,చైర్మన్లు, సచివాలయ సెక్రెటరీలు, కాలనీల పెద్దల ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్ మొల్లిహేమలత పాల్గొనే ఆమె చేతుమీదుగా జాతీయ పతాకావిష్కరణలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ మొల్లిహేమలత మాట్లాడుతూ మహనీయుల త్యాగల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛ వాయువులను పీల్చగలుగుతున్నామని, స్వతంత్ర జీవనాన్ని గడపగలుగుతున్నామని పలువురు దేశం కోసం పోరాడి అసువులు బాసారని కొనియాడారు.మనం స్వతంత్రంగా,స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది ఎందరోస్వాతంత్ర్య పోరాటయోధుల త్యాగఫలం అని,మనంవారి త్యాగాన్ని మరవకూడదని ఈసందర్భంగ వారిని స్మరించుట మన కర్తవ్యమని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులకు,పుస్తకాలు పెన్నులు,మిఠాయిలు పంపిణీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు,రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు మాట్లాడుతూ అనేక మంది దేశస్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసారని,రెండు శతాబ్దాలకు పైగా బ్రిటిష్ పాలన నుంచి, బానిస సంకెళ్లు నుంచి విముక్తి కలిగించిన మహనీయల కష్టానికి ఫలం మన స్వాతంత్ర్యంఅని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వాండ్రాసి అప్పలరాజు,భీమిలీ నియోజక వర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను,వార్డ్ అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ (జపాన్), కార్యదర్శి ఈగల రవికుమార్, వియ్యపునాయుడు, వైయస్సార్ కాలనీ ఓలేటి శ్రావణ్,మొకర రవికుమార్, హరికృష్ణ,నూకరాజు,విష్ణు, మదీనా ,విష్ణు ఇమ్మంది రాజు, జ్ఞానేషు, కటారి సురేష్, మాధవ,రాంబాబుసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.