చదువు నేర్పిన గురువులకు సత్కరించిన చంద్రంపాలెం హై స్కూల్ పూర్వ విద్యార్థులు.

 35 సంవత్సరాల తరు


వాత చంద్రంపాలెం జడ్పీహెచ్ జడ్పీహెచ్ స్కూల్ పూర్వ విద్యార్ధుల కలయిక, అప్పటి చదువు నేర్పిన గురువులకు సత్కారం



విశాఖపట్నం జిల్లా మధురవాడ---- (ప్రజాబలం న్యూస్) ---- చంద్రంపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 1987-88 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 35 సంవత్సరాల తరువాత విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులు చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అపూర్వ ఆత్మీయంగా కలుసుకోవడం జరిగింది, ఈ సందర్భంగా అప్పటి ఉపాద్యాయులు, విద్యార్థులు ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకొని పాఠశాలలో నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ సరస్వతీ దేవికి పూజలు నిర్వహించి అనంతరం అక్కడే ఉన్న మహాత్మా గాంధీ అబ్దుల్ కలాం విగ్రహాలకు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు., అనంతరం అందరూ కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఒకరికొకరు యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం అప్పటి స్కూల్ ప్రధానోపాధ్యాయులు లు యం. సుబ్బారావు, జి.శ్యామల, తెలుగు ఉపాధ్యాయులు కె.వి.,యస్..యస్.శర్మ, ఆరవెల్లి బుచ్చిబాబు, కె.వి.రమణ మూర్తి, జె.ఆనంద్ , యం.విజయలక్ష్మి, జి.సుహాసిని ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు యం.రాజబాబు లను ఘనంగా సత్కరించి మొమెంటోలను అందజేశారు., ఈ సందర్భంగా ఉపాద్యాయులు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు తరువాత మిమ్మల్ని ఆహ్వానించి ఘన సత్కారం చేసునందులకు సంతోషం వ్యక్తం చేశారు, శిష్యులంతా ఉన్నత స్థానాలకు ఎదగాలని దీవించారు., ఈ సందర్భంగా చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ఆవిర్భావం తరువాత మొదటి పదవ తరగతి పరిక్షల్లో ప్రధమ స్థానంలో ఉత్తీర్ణులైన లొడగల మాధవరావును సత్కరించారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్ధులు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు, 

 ఈ కార్యక్రమంలో 1987-88 10వ తరగతి బ్యాచ్ పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిళ్లా సూరిబాబు, పోతిన శివ లింగేశ్వరరావు, టి ఎస్ ఎస్ రాజు, పోతిన రాము, వానపిల్లి ముత్యాలరావు, మంతెన పార్వతి, పోతిన శేషుమాంబ, వరిపిల్లి శంకర్, గద్దెపిల్లి చిన్న అప్పన్న, బెవర బాపూజీ, బొంతు శ్రీనివాసరావు, ఏనుగుల అప్పలరాజు, పూతిరెడ్డి అప్పలరాజు, బలిరెడ్డి అప్పలరాజు, ఒమ్మి పోలినాయుడు, కె.గజలక్ష్మి, వి.విమల, లక్షి కుమారి, బోనెల రమేష్, హెచ్చెర్ల శ్రీను, ఏ.వి. కృష్ణారావు, ఇంటి రామారావు, దుంప సూరిబాబు 

పూర్వ విద్యార్ధుల సంఘం అధ్యక్షులు పోతిన నాయుడుబాబు, స్కూల్ కమిటీ చైర్మన్ బి మీనా కుమారి తదితరులు పాల్గొన్నారు.