పేదల పట్ల
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అన్న క్యాంటీన్లు తెరిపించాలి ...భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ - మధురవాడ (భీమిలి నియోజకవర్గం) (ప్రజాబలం న్యూస్ )--భీమిలి నియోజకవర్గం పరిధి జీవీఎంసీ ఒకటవ వార్డు తగరపువలస కూడలి లో చిట్టి వలస వెళ్లే దారిలో ఉన్న అన్న క్యాంటీన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ భీమిలి ఇంచార్జ్ కోరాడ రాజబాబు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ వల్ల వేలమంది పేదవారి ఆకలి తీర్చి, పేదల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరుకు ఓర్వలేక,ఈ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్ లను మూత వేసే విధానం, పేదవాడి నోటి ముందు అన్నాన్ని లాక్కునే, ఆ పద్ధతి సైకో పాలనకు అద్దం పడుతుందని ధ్వజమెత్తారు. నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వం వారికి పేద ప్రజల పట్ల చెత్త శుద్ధి ప్రేమ, ఉంటే వెంటనే అన్నా క్యాంటీన్ లను తెరిపించాలని సెల్ఫీ చాలెంజ్ తో ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, స్థానిక శాసనసభ్యులైన మొత్తం శెట్టి శ్రీనివాసరావు (అవంతి) ని సెల్ఫీతో భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు గట్టిగా ప్రశ్నించారు. వారితోపాటు రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ మొల్లి లక్ష్మణరావు భీమిలి రూరల్ పార్టీ అధ్యక్షులు డి ఏ ఎన్ రాజు ఒకటో వార్డు పార్టీ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు రెండో వార్డ్ అధ్యక్షులు బడిగింటి నీలకంఠం, విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చిలక నర్సింగ్ రావు, పిట్ట సూరిబాబు, సెక్రెటరీ నాగోతి సూర్యప్రకాష్, వాండ్రాశి అప్పలరాజు ఏడో వార్డ్ పిల్ల రాము తాళ వలస ఎంపిటిసి కోరాడ రమణ, నరవ రామారావు, దేవుళ్ళు,రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి నెంబర్ వాసుపల్లి పాలమ్మ,రాష్ట్ర చెట్టు బలిజ అధ్యక్షులు అంగటి రాము, నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు పాసి త్రినాథ్ కుమార్, జనరల్ సెక్రెటరీ దంతులూరి సిద్ధార్థ వర్మ, ఒకటవ వార్డు తెలుగు యువత అధ్యక్షులు గరే సదానంద రెండో వార్డ్ ఉపాధ్యక్షులు జగన్నాథం గణేష్ రెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పతివాడ రాంబాబు, నియోజకవర్గ రైతు ఉపాధ్యక్షులు పోతిన ఉమామహేశ్వరరావు,ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు బొద్దాపు శ్రీనివాస, ఆనందపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చెన్న రాజు, బోనీ ఎక్స్ సర్పంచ్ సచివరప్రసాద్, మూడవ వార్డ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కిరి అప్పన్న ఒకటో వార్డు యువత సెక్రటరీ వెంకీ తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.